డల్లాస్‌లో 17న దీపావళి వేడుకలు
న్యూయార్క్: హిందువుల ప్రధాన పండగలలో ఒకటైన దీపావళి పండగను అమెరికాలోని ప్రవాస భారతీయులు ఘనంగా నిర్వహించారు. దీపావళి పండగ సందర్భంగా వారి ఇళ్లను అందంగా అలంకరించి, ఇంటి ముందు నూనె దీపాలను వెలిగించి, టపాసులను కాల్చుతూ, మిఠాయిలను పంచుకున్నారు. డల్లాస్, ఫోర్త్ వర్త్ ప్రాంతాల్లో సుమారు 10వేల మంది ప్రవాసాంధ్రులు తెలుగు వారున్నారని, వారి కోసం దీపావళి వేడుకలు 2013 పేరుతో అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్(టిఏఎన్‌టిఈఎక్స్) ఓ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది.
అలెన్ టిఎక్స్‌లోని ఆధునిక వసతులు కలిగిన కళా కేంద్రంలో దీపావళి వేడుకలను పురస్కరించుకుని నవంబర్ 17న దీపావళి వేడుకలు 2013 పేరుతో ప్రత్యేక కార్యక్రామలను ఏర్పాటు చేసినట్లు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్(టాంటెక్స్) అధ్యక్షుడు సురేష్ మండువా తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రవాసాంధ్రులను ఆయన కోరారు.

టాంటెక్స్ కల్చరల్ అధ్యక్షులు కృష్ణవేణి శీలం, జ్యోతి వనంలు మాట్లాడుతూ.. సింగర్, నటుడు, నంది అవార్డు గ్రీహత సాగర్, సింగర్ రనైనా రెడ్డి, ప్రముఖ కమేడియన్లు రాకేష్, హరిబాబు, సింగర్ పృథ్వి చంద్ర, రాహుల్ సిప్లిగంజ్, యాంకర్ ప్రదీప్‌లు పాల్గొని తమ ప్రదర్శనలతో అలరిస్తారని తెలిపారు. కాబట్టి తెలుగువారందరూ ఈ కార్యక్రమానికి హాజరుకావాలని వారు కోరారు.
2013 దీపావళి వేడుకల ఈవెంట్ కో ఆర్డినేటర్ బల్కి చమ్కుర మాట్లాడుతూ ప్రతీ సీటుకు నెంబరు ఉంటుందని, నిరాశకు గురికాకుండా ముందుగానే టికెట్లను కొనుగోలు చేయాలని తెలుగు ప్రవాసీలను కోరారు.












Click it and Unblock the Notifications