లండన్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు(ఫోటోలు)
హైదరాబాద్: ఎన్నారై టీఆర్ఎస్ సెల్ లండన్‌లో ఘనంగా మొదటి తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు, తెరాస పాలనా మొదటి సంవత్సరాన్ని ఘనంగా నిర్వహించారు. యూకే నలుమూలల నుండి భారీగా తెరాస కార్యకర్తలు, తెలంగాణా వాదులు హాజరయ్యారు.
ఎన్నారై టీఆర్ఎస్ సెల్ కార్యదర్శి నవీన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో, ముందుగా అమరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి, జయశంకర్ గారికి నివాళ్ళు అర్పించి సభ్యులందరూ కలిసి కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

లండన్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
ఎన్నారై టీఆర్ఎస్ సెల్ వైస్ ప్రెసిడెంట్ మంద సునీల్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించి దానివల్ల ప్రజలకు కలిగే ఉపయోగం గురించి తెలిపారు.

లండన్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
ఎన్నారై టీఆర్ఎస్ సెల్ ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ దుసరి గారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వల్ల ప్రజల నుండి వస్తున్నా ఆదరణ గురించి తెలిపారు. ఎన్నారై టీఆర్ఎస్ సెల్ అద్యక్షులు అనిల్ కూర్మాచలం రాష్ట్ర అవతరణ వారోత్సవాల్లో పాల్గొనాలని లండన్ నుండి తెలంగాణా వెళ్ళారని చెప్పారు.

లండన్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
కార్యక్రమంలో TeNF ప్రెసిడెంట్ సీకా చంద్ర శేకర్ గౌడ్ గారు, ఎన్నారై టీఆర్ఎస్ సెల్ వైస్ ప్రెసిడెంట్ మంద సునీల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అశోక్ దుసరి, కార్యదర్శిలు నవీన్ రెడ్డి, వెంకాట్ రెడ్డి, UK ఇంచార్జ్ విక్రం రెడ్డి, లండన్ ఇంచార్జ్
రత్నాకర్ ముఖ్య నాయకులు సేరు సంజయ్, మల్ల రెడ్డి, మధు సుధన్ రెడ్డి, అక్రం, శశిధర్ గౌడ్, సందీప్ గౌడ్, మనోజ్, శ్రీధర్, రవి కిరణ్, వెంకి, నగేష్, నిఖిల్, వెంకట్ తది తరులు పాల్గొన్నారు.

లండన్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
ఒమాన్ మస్కట్ లో ఎన్నారై టీఆర్ఎస్ సెల్ కో ఆర్డినేటర్ శంకర్ అడువల అద్వర్యంలో ఈ వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో వినోద్, కిరణ్, రవి, స్వామి, శ్రీనివాస్, నజీర్, తిరుపతి, గంగాధర్, రవీందర్,
సందయ్య తది తరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications