భారత వైద్యునికి బ్రిటన్ గౌరవం

Bengali doctor
లండన్: బ్రిటన్ దేశంలో విశిష్ట వైద్య సేవలందించినందుకు గానూ ఆ దేశ ప్రతిష్టాత్మక పురస్కారమైన ‘ప్రైడ్ ఆఫ్ రీడింగ్‌'ను బ్రిటన్‌లో నివాసముంటున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వైద్యుడు డాక్టర్ అపూర్వ ఛటర్జీ అందుకున్నారు. రాయల్ బెర్ షైర్ ఆస్పత్రిలో వయస్సు పైబడి వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికోసం మల్టి డిసిప్లనరీ పార్కిన్సన్ క్లినిక్‌ను తొలిసారిగా ఏర్పాటు చేసినందుకు హెల్త్ వర్కర్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటించబడ్డారు.

వయస్సు పైబడడంతో వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి వృద్ధాప్య వైద్య నిపుణుడైన డాక్టర్ ఛటర్జీ విశేషమైన సేవలు అందించారు. వివిధ వ్యాధులతో బాధపడుతున్న వృద్ధుల జీవిత ప్రమాణాలను మెరుగుపర్చడం కోసం డాక్టర్ ఛటర్జీ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. ఛటర్జీ తన వైద్య సేవల ద్వారా తమ వ్యాధులను మరచిపోయి రోగులు హాయిగా నిద్రపోయేలా చేస్తున్నారు.

తొలిసారిగా 1997, ఆగస్టు 31న బ్రిటన్‌కు డాక్టర్ అపూర్వ ఛటర్జీ వచ్చారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం సిలిగురిలోని ఉత్తర బెంగాల్‌ మెడికల్ కాలేజీ, కోల్‌కతాలోని ట్రోపికల్ మెడిసిన్ స్కూల్‌లో ఆయన విద్యనభ్యసించారు. బెంగాల్‌లో ఉన్న తన తండ్రి గత 23 సంవత్సరాలుగా వృద్ధాప్యం వల్ల వ్యాధుల బారిన పడి ఇప్పటికీ బాధపడుతున్నారని డాక్టర్ ఛటర్జీ చెప్పారు.

తన తండ్రిని జాగ్రత్తగా చూసుకునే క్రమంలోనే వృద్ధాప్యంలో వచ్చే ఈ వ్యాధులను నివారించాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. భారతదేశంలో ఎక్కువ మంది వయస్సు పెరగడం వల్ల వచ్చే వ్యాధులను నివారించేందుకు న్యూరాలజిస్టులను సంప్రదిస్తారని ఆయన తెలిపారు. అయితే వారు న్యూరాలజిస్టును కాకుండా వృధాప్యంలో వచ్చే వ్యాధులపై అవగాహన ఉన్న ప్రత్యేక వైద్యుల వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+