వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జర్మనీ యునివర్సిటీల్లో విదేశీయులకూ ఉచిత విద్య

|
Google Oneindia TeluguNews

బెర్లిన్: ఇటీవల జర్మనీలోని లోవర్ సక్సోనీ రాష్ట్రం విశ్వవిద్యాలయ విద్యను ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించిన చివరి రాష్ట్రంగా అవతరించింది. యునివర్సీటాట్ హెయిడల్బర్గ్, ది యునివర్సిటాట్ మించెన్, హుంబల్ట్- యునివర్సిటాట్ జు బెర్లిన్ లాంటి ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో చదువు ఖర్చు చాలా తక్కువ. ఓ సెమిస్టర్‌కు 500 లేదా 630 యురోలు ఖర్చవుతాయి. ఇది అమెరికాలో చదివే విద్యార్థుల పుస్తకాల ధర కంటే తక్కువగా ఉండటం గమనార్హం. కాగా, అంత మొత్తం కూడా వసూలు చేయడం అన్యాయమని హాంబర్గ్ సెనెటర్ డోరోధీ స్టెపెల్ఫ్‌డ్ అన్నారు.

అద్భుత కట్టడాలు, మంచి కామర్షియల్ మార్కెట్, బీచుల అందాలు జర్మనీలో ఆకట్టుకునే విధంగా ఉన్నప్పటికీ.. ప్రస్తుతం జర్మనీలోని విశ్వవిద్యాలయాలు ఉచిత విద్యను అందించడంతో ప్రపంచంలోని విద్యార్థులు జర్మనీ వైపు చూస్తున్నారు. ప్రస్తుతం స్వదేశీ విద్యార్థులకే ట్యూషన్ ఫీజు లేకుండా విద్యనందిస్తున్న విశ్వవిద్యాలయాలు.. ఇప్పుడు విదేశీ విద్యార్థులకు కూడా అదేవిధంగా విద్యను అందిస్తున్నాయి. మీ పిల్లలకు నిజమైన ఉన్నతమైన విద్యను అందించాలని కోరుకుంటే జర్మనీకి పంపండి అని ఓ అమెరికా తల్లిదండ్రులు చెప్పడం గమనార్హం.

You Can Now Go to College in Germany for Free, No Matter Where You’re From

విదేశీ విద్య కోసం అనేకమంది విద్యార్థులకు పలు విశ్వవిద్యాలయాలో పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతుండగా.. జర్మనీ మాత్రం తమ దేశ విశ్వవిద్యాలయాల్లో ట్యూషన్ ఫీజు లేకుండా విద్యను అందిస్తోంది. తమ యూనివర్సిటీలను చూసి ఇతర దేశాల యునివర్సిటీలు జలసీగా ఫీలవుతున్నట్లు పలు సందర్భాల్లో జర్మనీ పేర్కొంది. అమెరికాలోని యునివర్సిటీల కంటే జర్మనీ యునివర్సిటీలు ఏ మాత్రం తీసిపోవు. ఇక్కడ సాంస్కృతిక, మౌలిక తేడాలుంటాయి. తక్కువ ఖర్చుతో చదువుకోవాలనుకునే విద్యార్థులకు జర్మనీ ఒక చక్కటి అవకాశంగా చెప్పుకోవచ్చు.

అమెరికాతో పోల్చుకుంటే క్యాంపస్ జీవితం కూడా తేడాగా ఉంటుంది. విశాలమైన తరగతి గదులు, గ్రంథాలయాలు మాత్రమే ఉంటాయి. ఘనమైన జిమ్ములు, వాటర్ పార్కులు, రిసార్టుల మాదిరిగా వసతులు ఉండవు. ఇప్పటికీ జర్మనీలో పిల్లలు తమ తల్లిదండ్రులతోనే తమ ఇళ్లల్లోనే ఉంటారు. అమెరికాలోలా కాలేజ్ లైఫ్, విహార యాత్రలు ఉండవు. జర్మనీ విద్యార్థులు విశ్వవిద్యాలయాల్లో కేవలం తరగతులు విని వెళ్లిపోతారు. మీరు జర్మనీలో లా, మెడిసిన్, లిటరేచర్, ఇంజినీరింగ్ లాంటి తదితర కోర్సులు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అమెరికాలో లాగా 25మందికి ఓ ఫ్రొఫెసర్ తరగతులు తీసుకోవడం జరుగదు. ఇక్కడ కొంచెం ఎక్కువ సంఖ్యలో అంటే సుమారు 200మందికి ఒకేసారి తరగతులు చెప్పడం జరుగుతుంది. అడ్మిషన్లు కూడా ఎక్కువగా ఉంటాయి. సెమిస్టర్ పూర్తయ్యే వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతూనే ఉంటాయి.

చాలా ఐరోపా దేశాలు ఉద్యోగుల కొరతను ఎదుర్కొంటున్నాయి. దీన్ని అధిగమించడం కోసం అక్కడి విశ్వవిద్యాలయాలు ఉచిత విద్యను ప్రవేశపెట్టాయి. జర్మన్ విశ్వవిద్యాలయాలు అటానమస్‌గా ఉంటాయి. పరిశోధన, భోధనలపై ఇవి శ్రద్ధ పెడతాయి. ప్రసిద్ధి చెందిన ఆవిష్కరణలు ఈ యునివర్సిటీల ద్వారానే జరుగుతాయి. పరిశోధన విద్యపై ఆసక్తి ఉన్న విద్యార్థులు జర్మనీ వైపు మొగ్గుచూపుతుండటానికి బలమైన కారణం ఇదే.

English summary

 Last week, Lower Saxony made itself the final state in Germany to do away with any public university tuition whatsoever.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X