Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లోన్ కోసం ఎవరి దగ్గరికి వెళ్లాల్సిన పనిలేకుండా… ఈ కాలిక్యులేటర్ మీ సీక్రెట్ వెపన్!

డబ్బును తెలివిగా నిర్వహించడం అనేది ప్రతీ క్షణం చాలా ముఖ్యమే. 2026 కూడా దీనికి భిన్నమేమీ కాదు. మీరు మీ ఇంటిని పునరుద్ధరించడం, ఒక సెలవును ప్లాన్ చేయడం, వైద్య ఖర్చులను కవర్ చేయడం లేదా అత్యవసర పరిస్థితిలో ఓ పర్సనల్ లోన్ మనల్ని కష్టాల నుంచి గట్టెక్కించగలదు. కానీ మీరు పర్సనల్ లోన్ కోసం అప్లై చేసే ముందు దానికి మీరు అర్హులా, కాదా.. మీ నెలవారి బడ్జెట్ పై ఒత్తిడి లేకుండా ఎంత వరకు లోన్ తీసుకోవచ్చు అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ క్రమంలో ఓ పర్సనల్ లోన్ ఎలిజిబిలిటి కాలిక్యులేటర్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

అప్పు తీసుకోవటానికి మీరు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారు అని తెలిపే మార్గదర్శి లాంటి ఈ లోన్ ఎలిజిబిలిటి కాలిక్యులేటర్ గురించి తెలుసుకోండి. మీ అర్హత గురించి ఊహించడం లేదా అప్లై చేస్తే మీ లోన్ దరఖాస్తు తిరస్కరణకు గురవుతుందోనని దిగులు పడే బదులు.. ముందుగానే ఈ కాలిక్యులేటర్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

How Much Loan Can You Get in 2026 One Click to Check Your Real Personal Loan Eligibility

పర్సనల్ లోన్ ఎలిజిబిలిటి కాలిక్యులేటర్ అంటే ఏమిటి?
ఒక పర్సనల్ లోన్ ఎలిజిబిలిటి కాలిక్యులేటర్ అనేది కొన్ని వివరాల ఆధారంగా మీరు ఎంత మొత్తం అప్పుగా తీసుకునేందుకు అర్హులు అనేది తెలుసుకొనుటకు ఉపయోగపడే ఒక ఆన్లైన్ టూల్. బజాజ్ ఫైనాన్స్ వంటి రుణదాతలు మీ రుణ మొత్తాన్ని నిర్ణయించటానికి మీ వయసు, నెలవారి ఆదాయం, నెలవారి ఖర్చులు, నగరం వంటి వాటిని ఆధారంగా చేసుకుని రుణాలు ఇస్తుంటారు. మీ అప్లికేషన్ ప్రాసెస్ చేయబడే వరకు వేచి ఉండే బదులు మీరు ముందుగానే ఈ కాలిక్యులేటర్ ను ఉపయోగించి మీరు అప్పుగా తీసుకోగలిగే మొత్తాన్ని క్షణాలలో అంచనా వేయవచ్చు.

పర్సనల్ లోన్ ఎలిజిబిలిటి కాలిక్యులేటర్ ఎలా పనిచేస్తుంది?
ఈ టూల్ ఉపయోగించడం మీ తరువాతి సెలవును ప్లాన్ చేసేంతసులభమైనది. మీరు ఈ వివరాలు ఎంటర్
చేయాలి:
*మీ నెలవారి ఆదాయము
*మీ నెలవారి ఖర్చులు
* మీ వయసు
*మీ పుట్టిన తేది

కాలిక్యులేటర్ ఆ తరువాత మీకు వచ్చే లోన్ మొత్తాన్ని వేగంగా అంచనావేస్తుంది. ఇది తక్షణమే పనిచేసి క్షణాలలో ఫలితాలను చూపిస్తుంది.

2026లో మీరు ఈ కాలిక్యులేటర్ ను ఎందుకు ఉపయోగించాలి?
మీరు ఇంటి పునరుద్ధరణ, విదేశీ ప్రయాణం, లేదా ఒక ఆన్లైన్ కోర్స్ చేయడం వంటి ఏవైనా భారీ ఖర్చుల గురించి ఆలోచిస్తూ ఉంటే, ఇప్పుడే దాని కోసం ప్రణాళిక చేసుకోవడం ముఖ్యం. పెరుగుతున్న కోరికలు, త్వరిత డిజిటల్ ఆమోదాలు, పెరుగుతున్న ఆర్ధిక అవగాహనలతో, ఇటువంటి టూల్స్ అనేవి ఒక ఎంపిక కంటే కీలకంఅవుతున్నాయి.కాలిక్యులేటర్‌ను ఉపయోగించడం వల్ల లాభాలు

1. సరైన మొత్తాన్ని అప్పుగా తీసుకోవటానికి సహాయపడుతుంది.
చాలామంది చాలాచిన్న మొత్తం కోసం కానీ చాలా పెద్ద మొత్తం కోసం కాని దరఖాస్తు చేస్తారు. చాలా చిన్న మొత్తం అప్పుగా తీసుకోవడం వల్ల పని జరగదు. మరీ ఎక్కువ మొత్తం తీసుకోవడం మీ నెలవారి బడ్జెట్ పై ఒత్తిడి వేయవచ్చు. మీరు సౌకర్యవంతంగా ఎంత మొత్తం అప్పుగా తీసుకోవచ్చనేది ఈ కాలిక్యులేటర్ మీకు నిర్ధారిస్తుంది.

2. సమయాన్ని ఆదా చేస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది.
బ్రాంచ్ లను సందర్శించడం లేదా ఏజెంట్స్ ను సంప్రదించడానికి బదులు మీరు అంచనాలను ఆన్లైన్ లో పొందవచ్చు. మీకు చివరి-నిమిషం ప్రయాణాన్ని ప్లాన్ చేయడం లేదా ఒక వైద్య అత్యవసర పరిస్థితిని నిర్వహించడం వంటి వాటికి నిధులు అత్యవసరంగా అవసరమైనప్పుడు ఇది చాలా సహాయపడుతుంది.

3. మీ ఈఎంఐలను మరింత మెరుగ్గా ప్లాన్ చేసుకోవటానికి సహాయపడుతుంది.
ఒక ఎలిజిబిలిటి కాలిక్యులేటర్ మీరు ఎంత లోన్ మొత్తానికి అర్హులు అనేది అర్థంచేసుకోవడంలో సహాయపడుతుంది. ఈ అంచనాలతో, మీరు పర్సనల్ లోన్ ఇంట్రెస్ట్ రేట్ ఎంపికలను సరిపోల్చి చూడడం, మీ ఈఎంఐలను ప్లాన్ చేసుకోవటానికి వివిధ కాలపరిమితుల గురించి ప్రయోగాలు చేయడంపై దృష్టి కేంద్రీకరించవచ్చు. ఇది లోన్ తీసుకునే మీ ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్‌తో కూడిన ఎలిజిబిలిటి కాలిక్యులేటర్ ద్వారా మీ తిరిగి చెల్లింపును ప్లాన్ చేసుకోవచ్చు.

4. మెరుగైన ఆర్ధిక ప్రణాళికకు సహకరిస్తుంది.
2026 కోసం ప్లాన్ చేయడం అంటే, మీ ఖర్చులను ఆలోచనాత్మకంగా నిర్వహించడం - అది ఇంటి మరమ్మత్తులైనా, వివాహ ఖర్చులు అయినా, ప్రయాణ ప్రణాళికలు అయినా లేదా విద్యాభ్యాసం అయినా. ముందుగానే మీ అర్హతను తెలుసుకోవడం వల్ల మీరు మీ లక్ష్యాలకు సరైన బడ్జెట్ ను ఏర్పాటుచేసుకోవచ్చు.

2026లో మీరు తెలుసుకోవలసిన అర్హత ప్రమాణాలు
ఎలిజిబిలిటి కాలిక్యులేటర్స్ త్వరగా అంచనాలు ఇస్తుండగా.. బజాజ్ ఫైనాన్స్ వంటి రుణదాతలు ఏయే అంశాలను పరిశీలిస్తారనేది తెలుసుకోవడం కూడా ఉపయోగకరంగా ఉంటుంది.

1. నెలవారి ఆదాయం: అధిక ఆదాయం అంటే అధిక లోన్ తీసుకునే అర్హత ఉంటుంది.
2. CIBIL స్కోర్: 650 కంటే ఎక్కువగా సిబిల్ స్కోర్ ఉంటే లోన్ సులువుగా పొందవచ్చు. మెరుగైన పర్సనల్ లోన్ వడ్డీ రేటును పొందటానికి సహాయపడవచ్చు.
3. ఉపాధి రకము: వేతన ఉద్యోగులు, స్వయం-ఉపాధి పొందిన వ్యక్తులు అందరు అర్హులే, కానీ నియమాలు
మారవచ్చు.
4. వయసు: చాలామంది రుణదాతలు 21 నుంచి 80 సంవత్సరాల మధ్య వయసు ఉన్న దరఖాస్తుదారులకు
ప్రాధాన్యత ఇస్తారు. రుణ కాలపరిమితి ముగిసే సమయానికి మీరు 80 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ
వయసు కలిగి ఉండాలి.

5. ప్రస్తుతం ఉన్న ఈఎంఐలు: ఎక్కువగా ఉన్న ఈఎంఐలు/కొనసాగే లోన్లు మీ అర్హతను తగ్గించవచ్చు.
6. స్థిరమైన ఆదాయము: స్థిరమైన ఉద్యోగము లేదా స్థిరమైన వ్యాపార ఆదాయము రుణదాతలకు నమ్మకాన్ని
కలిగిస్తుంది.

బజాజ్ ఫైనాన్స్ ప్రక్రియను ఎలా సులభతరం చేస్తుంది
తన త్వరిత డిజిటల్ ప్రక్రియలు, పారదర్శకమైన లోన్ నియమాలకు బజాజ్ ఫైనాన్స్ పేరుగాంచింది. ఈఎంఐ కాలిక్యులేటర్‌తోపాటు వారి పర్సనల్ లోన్ ఎలిజిబిలిటి కాలిక్యులేటర్ ఉపయోగించడం వల్ల మీరు మీకు అర్హత ఉన్న లోన్ మొత్తాన్ని తక్షణమే తెలుసుకోవచ్చు. మీ ఈఎంఐలను ప్లాన్ చేసుకోవచ్చు. మీ లోన్ మొత్తాన్ని మరింత నమ్మకంగా ప్లాన్ చేసుకోవచ్చు దరఖాస్తు సమయములో చివరి-నిమిషం ఆశ్చర్యాలు లేకుండా చూసుకోవచ్చు. అన్ని దస్తావేజులను ముందుగానే సిద్ధం చేసుకోవచ్చు. మీరు లోన్ అప్లై చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు, మీరు బజాజ్ ఫైనాన్స్ డిజిటల్ దరఖాస్తు ప్రయాణము గురించి తెలుసుకోవచ్చు. మీ ఖాతాలోకి త్వరగా డబ్బును పొందవచ్చు.

2026లో మీ అర్హతను మెరుగుపరచుకోవడం ఎలా?
ఒకవేళ కాలిక్యులేటర్ తక్కువ అర్హత మొత్తాన్ని చూపితే, మీరు ఈ విధంగా మీ అవకాశాలను మెరుగుపరచుకోవచ్చు:
*ప్రస్తుతం ఉన్న అప్పును తగ్గించడం
*మీరు ఇదివరకు తెలియజేయని ఆదాయ వనరులను చేర్చడం
*మీ నెలవారి ఖర్చులను పరిమితం చేయడం
చిన్నచిన్న చర్యలు తీసుకోవడం మీ మొత్తమ్మీది ఋణ అనుభవములో పెద్ద మార్పును తీసుకొనిరాగలవు.

ఒక పర్సనల్ లోన్ ఎలిజిబిలిటి కాలిక్యులేటర్ ఒక తెలివైన ప్లానర్ వంటిది. ఇది మీరు మీ ఆర్ధిక ప్రయాణాన్ని స్పష్టత, నమ్మకంతో ప్రణాళిక చేయడంలో సహాయపడుతుంది. 2026లోకి అడుగుపెడుతున్న ఈ తరుణములో బజాజ్ ఫైనాన్స్ వంటి విశ్వసనీయమైన రుణదాతల నుండి ఇలాంటి టూల్స్ ఉపయోగించడం అనేది మీరు మెరుగైన నిర్ణయాలను తీసుకొనుటకు, అనవసరమైన ఒత్తిడి లేకుండా చూసుకోవటానికి, మీ అవసరాలకు సరిపోయే రుణమొత్తాన్ని ఎంచుకొనుటకు సహాయపడతాయి.మీరు మీ కలల విహారయాత్రను ప్రణాళిక చేస్తున్నా, మీ ఇంటిని పునరుద్ధరించాలని అనుకుంటున్నా, లేదా రాబోయే మైల్ స్టోన్స్ కోసం సిద్ధపడుతున్నా, ముందుగానే మీ అర్హత గురించి తెలుసుకోవడం మీరు ఆర్ధికంగా సౌకర్యవంతంగా ఉన్నారని నిర్ధారిస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+