జూడో ప్లేయర్‌పై కోచ్ అత్యాచారం, ఆ తర్వాత పరారీ

Amritsar Judo Player Raped by Coach
అమృతసర్: తనపై కోచ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ వర్ధమాన జూడో ప్లేయర్ ఆరోపించింది. కేసు నమోదు కావడంతో కోచ్ పరారైనట్లు పోలీసులు బుధవారం చెప్పారు. జూడో ప్లేయర్ అయిన బాలిక పదో తరగతి చదువుతోంది. కోచ్ అమృతసర్‌లో చెహర్తాకు చెందినవాడు.

కోచ్ తమ ఇంటికి వచ్చాడని, తనకు ఆరోగ్యం సరిగా లేకపోయినప్పటికీ తనను శిబిరానికి పంపించాలని తన తల్లిదండ్రులపై కోచ్ ఒత్తిడి తెచ్చాడని ఆమె చెప్పింది. శిబిరం జూన్ 7వ తేదీన నుంచి వారం రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్‌లోని సుందర్‌నగర్‌లో జరుగుతోంది. బాలికను తీసుకుని వెళ్లడానికి కోచ్ జూన్ 9వ తేదీన వచ్చాడు.

ఇతర బాలికలు తమ కోసం అమృతసర్ రైల్వే స్టేషన్‌లో వేచి ఉన్నారని కోచ్ తనతో అబద్ధం చెప్పాడని, నిజానికి అప్పటికే వారంత సుందర్‌నగర్‌కు వెళ్లిపోయారని బాలిక చెప్పినట్లు అమృతసర్ పోలీసు కమిషనర్ ఆర్పీ మిట్టల్ చెప్పారు. రైల్వే స్టేషన్‌కు కాకుండా తనను కోచ్ అతని ఇంటికి తీసుకుని వెళ్లాడని, మర్నాడు రోజు తనను కాంగ్రాకు తీసుకుని వెళ్లి, అక్కడి నుంచి సుందర్‌నగర్‌లో దించాడని ఆమె చెప్పింది.

కోచ్ రెండు రాత్రుళ్లు, మూడు పగల్లు ఆ బాలికను బలవంతంగా తన వద్ద ఉంచుకున్నాడు. బాలిక జూన్ 17వ తేదీన ఇంటికి చేరుకుంది. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోచ్‌ను పట్టుకోవడానికి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
Are You Over 18?
By entering the site, you agree to our terms and conditions