ఫోన్ల ద్వారా గర్ల్స్ సప్లై, నెట్‌బ్యాంకింగుతో డబ్బులు

ఎనిమిది మంది ముఠా నిర్వాహకులతో పాటు 15మంది విటులను అరెస్టు చేశామని డిఎస్పీ ఎ. రమాదేవి తెలిపారు. ఇంటర్ విద్యార్థినిని వ్యభిచార కూపంలోకి చేర్చిన వరంగల్ జిల్లా కురవిలోని ఎస్‌వి ప్రైవేటు జూనియర్ కళాశాల కరస్పాండెంట్ వేణుమాధవ్‌తో పాటు మరో బ్రోకర్ పరారీలో ఉన్నారని వివరించారు.
ఫోన్ల ద్వారానే అమ్మాయిలను సరఫరా చేస్తూ నెట్‌బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో డబ్బులు వసూలు చేసుకుంటూ హైటెక్ వ్యభిచారాన్ని సాగిస్తున్నారని అన్నారు. వరంగల్, నల్గొండ, అదిలాబాద్, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన ఒక్కొక్కరు, ఖమ్మం, కరీంనగర్, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన ఇద్దరేసి యువతులను వ్యభిచార రొంపిలోకి దింపి వ్యాపారం సాగిస్తున్నాయని చెప్పారు.
కుటుంబ సమస్యలకు తోడు ప్రేమ పేరిట అమ్మాయిలకు వలవేసి వ్యభిచార గృహాలకు చేరవేసినట్లు తమ దర్యాప్తులో తేలిందని అన్నారు. వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో నాలుగు ముఠాలకు చెందిన పది మంది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి అమ్మాయిలను వలవేసి వారితో వ్యాపారం సాగిస్తున్నారని తెలిపారు.












Click it and Unblock the Notifications