సెక్స్ రాకెట్ గుట్టు రట్టు: బెజవాడ గర్ల్స్‌కు విముక్తి

మొహమ్మద్ జియా (30), షెరీఫ్ మిన్ (25), రాజేంద్ర (40) అనే ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముగ్గురిలో మొదటి ఇద్దరు బంగ్లాదేశ్‌కు చెందినవారు కాగా, రాజేంద్ర బెంగళూర్‌కు చెందినవాడు. వ్యభిచార ముఠా నుంచి రక్షించిన మహిళల్లో బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్, అస్సాం, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందినవారు ఉన్నారు.
ఆరేళ్ల బాలికపై అత్యాచారం
పంజాబ్‌లోని మొగా నగరంలో ఆరేళ్ల బాలికపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. నగరంలోని నానక్ నగ్రీ ప్రాంతంలో సోమవారం ఈ సంఘటన జరిగింది. దగ్గరలోని ఓ దుకాణంలో సాయంత్రం సరుకులు తేవడానికి తమ కూతురు వెళ్లి తిరిగి రాలేదని బాలిక తల్లి చెప్పింది.
పోలీసులు బాలికను రైల్వే ట్రాక్ వద్ద గుర్తించి, ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఓ వ్యక్తి బాలికను బలవంతంగా తీసుకుని వెళ్లి రేప్ చేశాడని అనుమానిస్తున్నారు. నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications
