మహిళను రేప్ చేసి హత్య చేశారు, వ్యక్తి హత్య

కిడ్నాప్ చేసి హత్య చేశారు
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో రెండు రోజుల కిత్రం అపహరణకు గురైన ప్రసాద్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. పెనుగొండ మండలం సిద్దాంతం దగ్గర గోదావరిలో ప్రసాద్ మృతదేహం లభ్యమైంది. భార్య తరఫు బంధువులే అతన్ని కిడ్పాప్ చేసి, హత్య చేసి ఉంటారని అని పోలీసులు అనుమానం వ్యక్తపరుస్తున్నారు. కిడ్నాపైన ప్రసాద్ భార్యను సోమవారం కిడ్నాపర్లు విడిచిపెట్టారు.
సంపులో పడి బాలిక మృతి
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని రామంతపూర్ వెంకటరెడ్డినగర్‌లో మంగళవారం ఉదయం ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు నీటిసంపులో పడిపోయారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరిని స్థానికులు రక్షించారు.
కాలువలో చిన్నారి గల్లంతు
కృష్ణా జిల్లా తొట్లవల్లూరు మండలం రొయ్యూరు కెఇబి కాలువలో ప్రమాదవశాత్తు పడిన ఓ చిన్నారి గల్లంతయింది. ఐదో తరగతి విద్యార్థిని తేజ మంగళవారం ఉదయం కాలువ వద్ద దస్తులు ఉతకడానికి వెళ్లి అందులో పడిపోయిందని స్థానికులు అంటున్నారు. దీంతో మృతదేహం కోసం తల్లిదండ్రులు, బంధువులు గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications