కలిసి ఉంటే శాపమైంది: పొదలమాటున నర్సు రేప్

దీంతో ఆమెకు శ్రీనివాస్‌తో మఖపరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆదివారం శ్రీనివాస్.. ఆసుపత్రికి తీసుకు వెళ్తానంటూ నమ్మబలికి నర్సును కారులో ఎక్కించుకున్నాడు. కొంతదూరం వెళ్లాక తనతో పాటు కారులో ఉన్న స్నేహితుడు అంజయ్య సాయంతో బలవంతంగా ఆమె కళ్లకు గంతలు కట్టి పరిగి మండలం కాళ్లాపూర్ శివారు వరకు తీసుకు వెళ్లి పొదల మాటున అత్యాచారం చేశాడు.
తలపై బండరాయితో కొట్టి పొదల్లో పడేసి వెళ్లిపోయాడు. తర్వాత యువతిని గుర్తించిన కొందరు ఆమెను ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై అపహరణ, అత్యాచారం, హత్యాయత్నం కేసును నమోదు చేశారు. యువతికి చికిత్స జరిపారు.
హైదరాబాదులో....
హైదరాబాదులో లారీ డ్రైవర్ మతిస్థిమితం లేని యువతిపై అత్యాచారం చేశాడు. జిహెచ్ఎంసిలో పని చేసే కాంట్రాక్టు లారీ డ్రైవర్ మతిస్థిమితం లేని యువతిపై అత్యాచారం చేశాడు. ఇతన్ని ఓ వ్యక్తి పోలీసులకు పట్టించాడు. బాలాపూర్‌కు చెందిన వెంకటేష్ శనివారం అర్ధరాత్రి బాలాజీనగర్ ప్రాంతంలో మతిస్థిమితం లేని 25 ఏళ్ల యువతిని లారీలో ఎక్కించుకొని స్థానికంగా ఓ పెట్రోల్ బంక్ సమీపంలో అత్యాచారం చేశాడు. ఇతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications