ఎంబిఎ విద్యార్థిని రేప్, హత్య: వివాహితపై దౌర్జన్యం

ఇది గ్రహించిన ఒక హోంగార్డు శివ ఆమె వెంట పడ్డాడు. ఒకే ఊరు కావటంతో శివపై నమ్మకంతో అతని ద్విచక్రవాహనంపై ఎక్కి మదనపల్లికి వచ్చింది. మదనపల్లికి వచ్చిన ఆమెను ఇంటికి దిగబెట్టాడు. ఎవరూ లేరని గ్రహించిన హోంగార్డు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ పెనుగులాటలో అనంతరం గొంతు నులిపి చంపిన అనవాలు కనిపిస్తున్నాయి.
ప్రకాశం జిల్లా చీరాల మండల పరిధిలోని గవినివారిపాలెంకు చెందిన వివాహిత ఫిర్యాదు మేరకు గవిని నాగరాజుపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఈపూరుపాలెం ఎస్సై ఆర్ రాంబాబు తెలిపారు. ఆయన అందించిన వివరాల ప్రకారం - గవినివారిపాలెంకు చెందిన వివాహిత గవిని కోటేశ్వరరావుకు 10వేల రూపాయలు అప్పుగా ఇచ్చింది. అప్పుతీర్చమని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోలేదు.
ఈ స్థితిలో శుక్రవారం రాత్రి కొంతమంది పెద్దమనుషులును తీసుకెళ్లి బాకీ తీర్చాలని అడిగింది. నాగరాజు పదిమందిలో బాధితురాలి జుట్టుపట్టుకుని కాలితో తన్నడమే కాకుండా జాకెట్టు చించి ఆమెపట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. గవిని రత్తమ్మకూడా బాధితురాలిపట్ల దురుసుగా ప్రవర్తించింది. దీనిపై బాధితురాలు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దాంతో గవిని నాగరాజును శనివారం సాయంత్రం గవినివారిపాలెం పొలాల్లో ఉండగా అరెస్టు చేశారు. దీంతో ఆ ముగ్గురుపై నిర్భయ చట్టం కింద కేసు నమోదుచేశామన్నారు. ముగ్గురులో నాగరాజును అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారన్నారు.












Click it and Unblock the Notifications
