దారుణం: బాలికపై ట్రైనీ ఎస్ఐ అత్యాచారయత్నం

SI tries to rape minor girl
నల్లగొండ: రక్షించాల్సిన అధికారే కాటేయజూశాడు. నల్లగొండలోని అలకాపురి కాలనీలో ఓ ట్రైనీ సబ్ ఇన్‌స్పెక్టర్ ఓ మైనర్ బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. భరత్ నాయుడు అనే ఆ ఎస్ఐ కబంధ హస్తాల్లోంచి తప్పించుకుని ఆ పాప అరిచింది. దీంతో ఇరుగుపొరుగువారు అక్కడ చేరారు. ఎస్ఐ వారి నుంచి తప్పించుకుని పారిపోయాడు.

ఆ తర్వాత బాధితురాలు నల్లగొండ టూ టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. చౌటుప్పల్ పోలీసు స్టేషన్‌కు చెందిన భరత్ నాయుడు రెండు నెలల క్రితం మైనర్ బాలికతో స్నేహం కుదుర్చుకున్నాడు. చిట్యాలలో నివసించే ఆ మైనర్ బాలికను ఆదివారంనాడు నల్లగొండలోని తన ఇంటికి భరత్ నాయుడు అహ్వానించాడని పోలీసులు చెప్పారు.

ఇంటికి వచ్చిన బాలికపై అతను అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తుండగా కార్మికులు కొందరు ఇంటి తలుపులు కొట్టారు. దాంతో అతను బయటకు వచ్చాడు. వారు వెళ్లిపోయిన తర్వాత మరోసారి బాలికపై అత్యాచారానికి ప్రయత్నించాడు. అయితే, తెలివిగా బాలిక అతని నుంచి తప్పించుకుంది.

భరత్ నాయుడి సస్పెన్షన్‌కు పోలీసు అధికారులు సిఫార్సు చేశారు. సంఘటనా స్థలాన్ని సందర్శించి నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
Are You Over 18?
By entering the site, you agree to our terms and conditions