ముంబై మరో దారుణం: నాలుగేళ్ల బాలికపై రేప్

బాధిత బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. 22 ఏళ్ల మహిళా జర్నలిస్టుపై అత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా కలవరం కలిగించింది.
మహిళా ఫొటో జర్నలిస్టుపై అత్యాచారం కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. బాధితురాలిని సురక్షిత ప్రాంతానికి తరలించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. మహిళా ఫొటో జర్నలిస్టుకు ముంబైలో రక్షణ లేదనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ముంబైలోని శక్తి మిల్స్ ఆవరణలో విధులు నిర్వహించడానికి వెళ్లిన మహిళా జర్నలిస్టుపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెకు తోడుగా వెళ్లిన సహోద్యోగిని వారు తీవ్రంగా గాయపరిచారు.












Click it and Unblock the Notifications