మహిళపై భర్తతో పాటు మామ, బావ గ్యాంగ్ రేప్

మహిళ భర్త, బావ, మామలను పోలీసులు ఆదివారంనాడు అరెస్టు చేశారు. జంజ్‌గిర్ జిల్లాలోని బార్పలి గ్రామానికి చెందిన బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. శుక్రవారం ఆమెపై వారు అత్యాచారానికి దిగినట్లు జంజ్‌గిర్ - చంపా ఎస్పీ షేక్ ఆరిఫ్ హుస్సేన్ చెప్పారు.
తన భర్త, తన అత్తింటివారు తనపై శుక్రవారం రాత్రి అత్యాచారం చేశారని బాధితురాలు ఆదివారంనాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో కూడా తనపై పలుమార్లు అసభ్యంగా ప్రవర్తించినట్లు 27 ఏళ్ల ఆ మహిళ తన ఫిర్యాదులో ఆరోపించింది.
సామూహిక అత్యాచారం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. దేశంలో మహిళలపై పురుషుల అఘాయిత్యాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయని చెప్పడానికి ఇటువంటి సంఘటనలు వెలుగు చూస్తున్నాయి.












Click it and Unblock the Notifications