}

దారుణ ఘటన: తల్లి బాకీకి కూతురిపై అత్యాచారం

Girl sexually assaulted in Chittoor district
చిత్తూరు: తల్లి బాకీ చెల్లించని నేరానికి ఐదేళ్ళ బాలికను నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసిన వైనం చిత్తూరు జిల్లాలో జరిగింది. తమిళనాడులోని వేలూరుకు చెందిన ఓ మహిళ (30) కొంతకాలంగా చిత్తూరు జిల్లా పలమనేరులోని ఒక హోటల్‌లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.

అక్కడే ఓ కోళ్లఫారంలో పనిచేస్తున్న ముబారక్ (30) వద్ద ఆమె రూ.2000 అప్పు చేసింది. అయితే బాకీ తిరిగి చెల్లించకపోవడంతో ఆమె ఐదేళ్ల కుమార్తెను 10 రోజులక్రితం ముబారక్ బలవంతంగా తీసుకెళ్లిపోయి నిర్బంధించాడు. డబ్బులిస్తేనే పంపిస్తానని తేల్చి చెప్పాడు.డబ్బులు ఇవ్వలేక ఆమె నిస్సహాయురాలిగా మిగిలిపోయింది.

ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి కుమార్తెను చూడ్డానికి ముబారక్ ఇంటికి వెళ్లిన ఆమె తమ కూతురు పరిస్థితి చూసి చలించిపోయింది. ముబారక్ పాపను చిత్రహింసలు పెట్టడమే కాక అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిసి కుమిలిపోయింది.

బలవంతంగా కుమార్తెను తీసుకెళ్లి పలమనేరు వైద్యశాలలో చేర్పించింది. చిత్రహింసల కారణంగా బాలికకు తీవ్రగాయాలున్నట్లు వైద్యులు ధృవీకరించారు. పలమనేరు పోలీసులు ముబారక్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
Are You Over 18?
By entering the site, you agree to our terms and conditions