దారుణం: విద్యార్థినిపై స్కూల్ డైరెక్టర్ అత్యాచారం

పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో తన మాట వినకుంటే పరీక్షల్లో తప్పుతావని బెదిరించి బాలికను లొంగదీసుకున్నాడు. తీవ్రమైన నొప్పితో నడవలేని స్థితిలో బాలిక ఇంటికి చేరుకోగా తల్లిదండ్రులు మూడు రోజులుగా ఈ విషయం ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టారు.
సోమవారం రాత్రి బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో విషయం బయటపడింది. విద్యార్థులు, స్థానికులు పాఠశాలపై దాడి చేసి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. డైరెక్టర్‌కు దేహశుద్ధి చేయాలని ప్రయత్నించగా దొడ్డిదారిన పరారయ్యాడు. అతని బైక్, స్కూలులో కుర్చీలు, ఇతర సామగ్రిని స్థానికులు ధ్వంసం చేశారు.
సిఐ రామారావు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. నిందితునికి కళాశాలల నిర్వాహకులు మద్దతుగా నిలిచి తప్పించారనే సమాచారాన్ని స్థానికులు ఇవ్వడంతో ఈ దిశగా కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితుడు ఎక్కడ దాగివున్నా అదుపులోకి తీసుకుంటామని కేసు దర్యాప్తు చేపట్టిన సిఐ రామారావు చెప్పారు.












Click it and Unblock the Notifications
