గుంటూరులో దారుణం: బాలికపై ఇద్దరు మైనర్లు రేప్

బాధితురాలి తల్లి వేదుల్లపల్లి పోలీసు స్టేషన్లో సంఘటనపై ఫిర్యాదు చేసింది. సోమవారం సాయంత్రం 12, 13 ఏళ్ల వయస్సు గల ఇద్దరు బాలురు గ్రామంలోని పాఠశాల వద్ద ఆడుకుంటున్న అమ్మాయిపై కన్నేశారు. ఆమెను నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లి ఆమెపై అత్యాచారం జరిపారు.
ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కడుపులో నొప్పి వస్తుందంటూ బాలిక తల్లికి చెప్పింది. దాంతో చీరాలలోని ప్రైవేట్ ఆస్పత్రికి కూతురిని తల్లి తీసుకుని వెళ్లింది. జరిగిన విషయాన్ని అప్పుడు బాలిక చెప్పింది. వైద్యుడి సలహాతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వైద్య పరీక్షల నిమిత్తం బాలికను చిరాల ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. ఇద్దరు మైనర్ బాలురను కస్టడీలోకి తీసుకున్నట్లు, కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications
