సూపర్ స్టార్ రజనీకాంత్ భగవదనుగ్రహం వల్ల త్వరగా కోలుకోవాలని కోరుకున్న పవన్ కళ్యాణ్
సూపర్ స్టార్ రజనీకాంత్ విపరీతంగా బీపీ పెరగడంతో తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అన్నాత్తే సినిమా షూటింగ్లో పాల్గొనడానికి హైదరాబాద్ కు వచ్చిన రజినీకాంత్ చిత్ర యూనిట్ లో ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ రావడంతో సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్ళిపోయారు. సినిమా షూటింగ్ ఆగిపోవడమే కాకుండా సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడంతో , ఆయనకు కూడా కరోనా సోకిందేమో అన్న అనుమానంతో ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడ్డారు.

రజనీ కాంత్ ఆరోగ్యం పై స్పందించిన పవన్ కళ్యాణ్
రజనీకాంత్ కు కరోనా నెగిటివ్ వచ్చిందని ,కరోనా విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తేల్చడంతో ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇదే సమయంలో రజనీకాంత్ ఆరోగ్యం పై పవర్ స్టార్ , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. రజనీకాంత్ ఆరోగ్యం మెరుగుపడాలని ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
ఈ మేరకు పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు.

మనోధైర్యం మెండుగా ఉన్న రజినీకాంత్ గారు త్వరగా కోలుకోవాలన్న జనసేనాని
ఆ ప్రకటనలో రజనీకాంత్ గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా అంటూ తన ఆకాంక్షను వ్యక్తం చేశారు . ప్రముఖ కథానాయకుడు రజనీకాంత్ గారు అస్వస్థతకు గురై హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చేరినట్లు తెలిసి బాధపడ్డాను అని పేర్కొన్న పవన్ కళ్యాణ్ కరోనా లక్షణాలు లేవని వైద్యులు ప్రకటించడం ఊరటనిచ్చిందన్నారు. మనోధైర్యం మెండుగా ఉన్న రజినీకాంత్ గారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానన్న పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక పరమైన భావాలు ఉన్న ఆయనకు భగవదనుగ్రహం కలగాలి అని తన ఆకాంక్షను వ్యక్తం చేశారు.

మహావతార్ బాబాజీ ఆశీస్సులతో సంపూర్ణ ఆరోగ్యంతో మన ముందుకు రావాలి
అంతేకాదు ఆయన ఎంతగానో విశ్వసించే మహావతార్ బాబాజీ ఆశీస్సులతో సంపూర్ణ ఆరోగ్యంతో మన ముందుకు రావాలని కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ ప్రకటన విడుదల చేశారు.డిసెంబర్ 22 వ తేదీ నుండి అన్నాత్తే చిత్ర యూనిట్ సభ్యులకు కొంతమందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో అప్పటినుండి రజనీకాంత్ సెల్ఫ్ క్వారంటైన్ అయ్యారు . తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించే లా డిసెంబర్ 31 నాడు పార్టీని ఏర్పాటు చేస్తానని చెప్పి, పొంగల్ నాటికి పార్టీని అధికారికంగా ప్రకటించాలని రజినీకాంత్ యుద్ధప్రాతిపదికన పనులు చేస్తున్నారు.

రజనీ అనారోగ్యం కూడా పార్టీ ప్రకటన ఆలస్యం అవ్వటానికి కారణం అయ్యే ఛాన్స్
ఈ సమయంలో ఈ సినిమాను పూర్తి చేసి పూర్తిగా రాజకీయాలకు వెళ్లాలనుకున్న రజనీకాంత్ కు కరోనా షాకిచ్చింది. చిత్ర యూనిట్ సభ్యులకు కరోనా సోకిన కారణంగా నాలుగు వారాలపాటు సినిమాను పోస్ట్ పోన్ చేశారు .ప్రస్తుతం రజనీకాంత్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు బీపీ లో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉన్న కారణంగా రెండు రోజులపాటు చికిత్స అందించి డిశ్చార్జ్ చేస్తామని ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. రజనీకాంత్ ఫ్యాన్స్, అలాగే పలువురు ప్రముఖులు రజినీకాంత్ త్వరగా కోలుకోవాలని తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం రజనీ ఆనారోగ్యం కూడా ఆయన పార్టీ ఆలస్యం కావటానికి కారణం అవుతుందని భావిస్తున్నారు పలువురు రాజకీయ నేతలు .












Click it and Unblock the Notifications