పెన్నా ‘దీపఖడ్గం’కు అవార్డు

పద్యకవితా ప్రక్రియలో ఈసారి సివి సుబ్బన్న శతావధాని రచించిన పద్యకృతి ‘దివ్యలోచన ప్రబంధం’, వచన కవితా ప్రక్రియలో పెన్నా శివరామకృష్ణ రచించిన ‘దీపఖడ్గం’ సాహితీ పురస్కారాలకు ఎంపికైనట్టు ఆయన తెలిపారు.బాలసాహిత్యంలోఎన్‌విఆర్ సత్యనారాయణ మూర్తి రాసిన ‘పొట్టివాడు’కు పురస్కరాం లభించింది.
కథానిక ప్రక్రియలో పెద్దింటి అశోక్‌కుమార్ ‘మాయిముంత’ కథల సంపుటి, నవలా ప్రక్రియలో గూడ అంజయ్య రాసిన పొలిమేర నవల, సాహిత్య విమర్శలో లక్ష్మణ చక్రవర్తి రాసిన ‘లక్ష్మణరేఖ’ పురస్కారాలు పొందాయి. నాటకం విభాగంలో ఎస్ మునిసుందరం రాసిన మునిసుందరం సాంఘిక రూపకాలకు, అనువాద విభాగంలో డాక్టర్ పుట్టపర్తి నాగపద్మిని రాసిన ‘శ్రీకాంతవర్మ’కు పురస్కారాలు దక్కాయి.
ఇతర వచన రచనల విభాగంలో సింహప్రసాద్ రాసిన ‘వివాహవేదం’ రచయిత్రి ఉత్తమ విభాగంలో గంటి భానుమతి రాసిన ‘జీవనపోరాటం’ ఈఏటి సాహిత్య పురస్కారాలు పొందాయని శివారెడ్డి తెలిపారు. త్వరలో హైదరాబాద్‌లో జరిగే ప్రత్యేక ఉత్సవంలో పురస్కారాలు ప్రదానం చేస్తామని, పురస్కారం కింద ఒకొక్కరికి 20,116 రూపాయిల నగదు అందజేసి సత్కరిస్తామని అన్నారు.












Click it and Unblock the Notifications