వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నవ్వించి ఏడ్పించిన ఆర్‌కె

By Staff
|
Google Oneindia TeluguNews

నవ్వించి ఏడ్పించిన రాశిపురం కృష్ణస్వామి నారాయణ్‌ ఇక లేరంటే ఏడ్పొచ్చినంత పని అవుతుంది. అంతర్జాతీయ కీర్తిని ఆర్జించిన అగ్రశ్రేణి భారత ఆంగ్ల నవలా రచయితల కోవలోకి ఆర్‌.కె. నారాయణ్‌ వస్తారు. ఆయన హాస్యం ద్వారా జీవిత సత్యాలను అవిష్కరించాడు. మనల్ని నవ్విస్తూ మనలోకి మనం తొంగి చూసుకునే గొప్ప అనుభవాన్ని రాశిపురం కృష్ణస్వామి నారాయణ్‌ తన రచనల ద్వారా పంచారు. ఆయన ఇటీవల తనువు చాలించారు. ఆయన కలానికి విశ్రాంతి దొరికింది.

ఆర్‌.కె. నారాయణ్‌ 1906లో మద్రాసు (చెన్నై)లో జన్మించాడు. ఆయన కొంత కాలం టీచర్‌గా పని చేశాడు. ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి కాలం రచనా వ్యాసంగానికే వెచ్చించారు. చాలా కాలం ఆయన మైసూరులో జీవించారు. ఆయన రచనల్లో ఎక్కువగా మైసూరు జీవితం ప్రతిఫలించడానికి ఇదే కారణం. స్థానిక ఇతివృత్తానికి అంతర్జాతీయ సాహిత్యంలో గౌవర స్థానం కల్పించిన అతి కొద్ది మంది ఆంగ్ల రచయితల్లో ఆర్‌.కె. నారాయణ్‌ ఒక్కరు. ఆయన నిరంతర పథికుడు కూడా. ఆయన విశేషంగా పర్యటనలు చేశారు. ఆయన మొదటి నవల 'స్వామి అండ్‌ హిజ్‌ ఫ్రెండ్స్‌' (1935) కథ మాల్గుడి అనే పట్టణాన్ని సృష్టించి అక్కడ నడిపించాడు. నారాయణ్‌ సృష్టించిన మాల్గుడి పాఠకుల గుండెల్లో స్థిరనివాసం ఏర్పరుచుకుంది. ఆయన రచనల్లో భారతదేశ సమకాలీన పరిస్థితులను, జీవితాలను ప్రతిబింబించారు. తద్వారా అవి ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి.

నారాయణ్‌ కొంత కాలం మైసూరులో జర్నలిస్టుగా కూడా పని చేశారు. ఆ తర్వాత రచనా వ్యాసంగమే ప్రధానంగా పెట్టుకున్నారు. ఆయన రాసిన 'ది గైడ్‌' నవల సినిమాగా కూడా వచ్చింది. ఆర్‌.కె. నారాయణ్‌ ఐదు కథా సంపుటాలు అచ్చయ్యాయి. అవి- ఎ హార్స్‌ అండ్‌ టు గోట్స్‌, యన్‌ ఆస్ట్రాలజర్స్‌ డే, లాలీ రోడ్‌, మాల్గుడి డేస్‌, ద గ్రాండ్‌ మదర్స్‌ టేల్‌. మై డేట్‌లెస్‌ డైరీ, ది ఎమరాల్డ్‌ రూట్‌ అనే రెండు యాత్రా చరిత్రలు కూడా ఆయన రాశారు. అనేక వ్యాసాలు కూడా రాశారు.

ఆర్‌.కె. నారాయణ్‌కు 1980లో ఎ.సి. బెన్సన్‌ అవార్డు ఇచ్చి రాయల్‌ సొసైటీ ఆఫ్‌ లిటరేచర్‌ సత్కరించింది. అమెరికా అకాడమీ అండ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ లెటర్స్‌ గౌరవ సభ్యుడిగా కూడా ఆయన వున్నారు. ఆంగ్ల సాహిత్యానికి చేసిన సేవకు గుర్తించి మైసూరు విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. ది గైడ్‌ అనే నవలకు ఆయన 1958లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు.

ఆర్‌.కె. నారాయణ్‌ రచనలు

1935- స్వామి అండ్‌ హిజ్‌ ఫ్రెండ్స్‌
1937- బ్యాచులర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌
1938- ది డార్క్‌ రూమ్‌
1939- మైసూరు
1945- ది ఇంగ్లీష్‌ టీచర్‌
1947- యన్‌ ఆస్ట్రాలజర్స్‌ డే అండ్‌ అదర్‌ స్టోరీస్‌
1949- మిస్టర్‌ సంపత్‌-ది ప్రింటర్‌ ఆఫ్‌ మాల్గుడి
1952- ద ఫైనాన్షియల్‌ ఎక్స్‌పర్ట్‌
1953- గ్రేట్‌ఫుల్‌ టు లైఫ్‌ అండ్‌ డెత్‌
1955- వెయిటింగ్‌ ఫర్‌ ద మహాత్మా
1956- లాలీ రోడ్‌ అండ్‌ అదర్‌ స్టోరీస్‌
1958- ది గైడ్‌
1960- నెక్స్‌ట్‌ సండే: స్కెచెస్‌ అండ్‌ ఎస్సేస్‌
1961- ద మ్యాన్‌ ఈటర్‌ ఆఫ్‌ మాల్గుడి
1964- మై డేట్‌లెస్‌ డైరీ: యన్‌ అమెరికన్‌ జర్నీ
1965- గాడ్స్‌, డెమన్స్‌, అండ్‌ అదర్స్‌
1967- ది వెండర్‌ ఆఫ్‌ స్వీట్స్‌
1970- ఎ హార్స్‌ అండ్‌ టు గోట్స్‌, స్టోరీస్‌
1972- ది రామాయణ; ఎ షార్టెన్‌డ్‌ మోడర్న్‌ ప్రోస్‌ వర్షెన్‌
1974- మై డేస్‌
1974- రిలక్టంట్‌ గురు
1976- ది పెయింటర్‌ ఆఫ్‌ సయిన్స్‌
1978- ది మహాభారత: ఎ షార్టెన్‌డ్‌ మోడర్న్‌ ప్రోస్‌ వర్షెన్‌
1980- ద ఎమరాల్డ్‌ రూట్‌
1982- మాల్గుడి డేస్‌
1983- ద టైగర్‌ ఫర్‌ మాల్గుడి
1985- అండర్‌ ద బనయన్‌ ట్రీ అండ్‌ అదర్‌ స్టోరీస్‌
1986- టాకిటివ్‌ మ్యాన్‌
1988- ఎ రైటర్స్‌ నైట్‌మేర్‌
1989- ఏ స్టోరీ టెల్లర్‌ వరల్డ్‌: కథలు, వ్యాసాలు, స్కెచ్‌లు
1990- ది వరల్డ్‌ ఆఫ్‌ నాగరాజ్‌
1992- మాల్డుడి ల్యాండ్‌స్కేప్స్‌
1993- ది గ్రాండ్‌మదర్స్‌ టేల్‌: మూడు నవలలు
1993- సాల్ట్‌ అండ్‌ సాడస్ట్‌: కథలు, టేబుల్‌ టాక్‌

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X