బేతవోలుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
ప్రముఖ సాహితీవేత్త, అధ్యాపకుడు బేతవోలు రామబ్రహ్మంకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. అనువాద విభాగంలో ఆయనకు ఈ అవార్డు లభించింది. ఆయన సంస్కృతం నుంచి దేవభాగవతం కావ్యానికి ఈ అవార్డు లభించింది.
వ్యాసుడు రాసిన కావ్యాన్ని ఆయన తెలుగులోకి అనువదించారు. ఈ కావ్యాన్ని తిరుపతి వేంకటకవులు, మరికొంత మంది తెలుగులోకి అనువదించారు. వారు పద్యకావ్యంగా దాన్ని తెలుగులోకి అనువదించారు. దేవీ భాగవతం సంస్కృత కావ్యాన్ని యథానువాదంగా తెలుగు వచనంలో చేయడం బేతవోలు ప్రత్యేకత. బేతవోలు రామబ్రహ్మం తెలుగు విశ్వవిద్యాలయం రాజమండ్రిలో పని చేస్తున్నారు. తెలుగు పద్యంపై ఆయనకు విశేష సాధికారిత ఉంది.












Click it and Unblock the Notifications
