దార్లకు అవార్డు

అణగారిన వర్గాల అభ్యున్నతిని ఆకాంక్షిస్తూ సామాజిక, సాహిత్య రంగాలలో కృషి చేసే వారికి జాతీయస్థాయిలో భారతీయ దళిత సాహిత్య అకాడమీ(ఢిల్లీ) వారిచ్చే బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ ఫెలోషిప్ అవార్డు(2007)ను ప్రముఖకవి, విమర్శకుడు, హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటిలో తెలుగు అధ్యాపకుడు డా. దార్ల వెంకటేశ్వరరావుకి ప్రకటించారు. ఢిల్లీలో డిసెంబర్ 9, 10 వ తేదీలలో జరిగే అకాడమీ 23వ జాతీయ సమావేశాల్లో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుతో డా. దార్ల వెంకటేశ్వరరావుని సత్కరించడం జరుగుతుందని అకాడమీ జాతీయ అధ్యక్షుడు డా. ఎస్.పి. సుమనస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు.

డా. దార్ల వెంకటేశ్వరరావు ఆరుద్ర రచనలపై పరిశోధన చేశారు. దళిత జీవితాలను ప్రతిఫలిస్తూ "దళిత తాత్త్వికుడు" కవితాసంకలనాన్ని ప్రచురించారు. "మాదిగ చైతన్యం", "సాహితీమూర్తుల ప్రశస్తి" గ్రంథాలకు ఉప సంపాదకుడు గా వ్యవహరించారు. అమ్మ, మాఊరు, నాయిన, కవితామాలిక తదితర కవితా సంకలనాల్లో ఈయన కవితలు ప్రచురితమయ్యాయి. అంతర్జాతీయ ఆంగ్ల త్రైమాస పత్రిక "లిటిక్రిట్ ఇండియా" లో డా. దార్ల అనువాద కవితలు ప్రచురితమయ్యాయి. వివిధ సాహితీ ప్రతికలు, ప్రత్యేక సంచికలు, ఇంటర్నెట్ పోర్టల్స్ లో అనేక వ్యాసాలు ప్రచురితమయ్యాయి. వివిధ విశ్వవిద్యాలయాలు , కళాశాల్లో జరిగిన జాతీయ స్థాయి సెమినార్ల లో పలు పరిశోధనా పత్రాలను సమర్పించారు. "డా. యస్. టి. ఙ్ఞానానందకవి ఆమ్రపాలి పరిశీలన గ్రంథాన్ని ప్రచురించారు. కవితలు, కథలు, వ్యాసాలు రాశారు.

స్కాట్లాండు లోని గ్లాస్కో విశ్వవిద్యాలయం ఆచార్యులు సైమన్‌ చార్స్లీ , ఆంధ్రప్రదేశ్ లో దళితుల గురించి చేస్తున్న ప్రస్తుత పరిశోధనలో సాహిత్య విషయలకు సంబంధించి డా. దార్ల వెంకటేశ్వరరావు సహకరిస్తున్నారు.

ఇంటర్నెట్ లో డా. దార్ల వెంకటేశ్వరరావు నిర్వహిస్తున్న గురించి ఆచార్యులు సైమన్‌ చార్స్లీ తన వెబ్ సైట్లో డా. దార్ల గురించి ప్రముఖంగా పేర్కొనడం గమనార్హం!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+