గోపిని కరుణాకర్ కు పురస్కారం
ప్రముఖ కథా రచయిత, కవి గోపిని కరుణార్ కు ఈ ఏడాది కథా కోకిల పురస్కారం లభించింది. ఈ విషయాన్ని మధురాంతకం రాజారాం సాహిత్య సంస్థ కార్యదర్శి డాక్టర్ వి.ఆర్. రాసాని తెలిపారు. గోపిని కరుణాకర్ రచించిన భారతం బొమ్మలు - మరికొన్ని కథలు అనే కథా సంపుటాన్ని ఈ పురస్కారం కోసం ఎంపిక చేశారు. దేశ పౌరాణిక, జానపద కథారీతులను, ప్రాక్పశ్చిమ కథా లక్షణాలను కరుణాకర్ తన రచనల్లో అద్భుతంగా వ్యక్తీకరించారని సంస్థ అభిప్రాయపడింది. ఆయన రచనలకు రెండు సార్లు జాతీయ అవార్డులు వచ్చాయి. ఇంగ్లీష్, హిందీ భాషల్లోకి కూడా ఆయన కథలు అనువాదమయ్యాయి.












Click it and Unblock the Notifications