• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సంచార జాతుల అర్ద్రత 'జిగిరి'

By Pratap
|

Peddinti Ashok Kumar
ఇదో సాధారణ నవల. అందుకే చాలా తొందరగా ఏడు భాషల్లోకి అనువాదమైంది. ఇలాంటి నవలలు మిగిలిన భాషల నుంచి తెలుగులోకి అనువాదం కావడం సర్వసాధారణం. అటువంటిది తెలుగులోనే ఇటువంటి నవల రావడం తెలుగువారిగా మనకు గర్వకారణం. కథావస్తువును ఎంచుకోవటంలోనూ, ఒక నవలగా దాన్ని మలచటంలోనూ పెద్దింటి అశోక్ కుమార్ ప్రతిభ ప్రకటితమవుతుంది. ఇప్పుడంటే ప్రభుత్వ ఆంక్షలతో గుడ్డేలుగు లేదా ఎలుగుబంటిని ఆడించి పొట్ట పోసుకునే సంచార జాతులు అరుదైపోయాయి గానీ, చాలా కాలం క్రితం గ్రామాల్లో ప్రజలకు ఇదో ఆట విడుపు. కోతుల్ని ఆడించేవాళ్లు ఇంకా ఇతర జంతువుల్ని ఆడించేవాళ్లు వీరి జివన విధానమెలా వుంటుందో మనకు పట్టని విషయం. పట్టించుకోని విషయం. ఈ సంచార జాతులలో ఎక్కువ మంది ముస్లింలే వుంటారు.

జిగిరి నవల ప్రధానంగా ఒక గుడ్డెలుగు షాదుల్‌కు, దాని యజమాని ఇమామ్‌కు ఉండే ఒక అనిర్వచనీయమైన అత్యున్నత స్థాయి ప్రేమానుబంధానికి నిదర్శనంగా నిలుస్తుంది. జంతు పరిరక్షణ పేరుతో వచ్ిచన చట్టాలు ఒక కుటుంబానికి ఒక జంతువుకు మధ్య ఉండే ఒక దృఢమైన బంధాన్ని ఎలా ఛిద్రం చేస్తాయో అనుభవపూర్వకంగా చెప్పే నవల. జంతువుల్ని ఆడించి పొట్ట పోసుకునేవారికి ఆ జంతువులతో ఒక అనురాగపూర్వక సంబంధం ఉంటుందనే వాస్తవాన్ని గుర్తించని సమాజాన్ని, రాజ్యబలాన్ని నిరసించే నవల. అప్పటి వరకు హాయిగా వున్న మనుషులు వున్నట్లుండి స్వార్థపరులుగా మారిపోవడంలో రాజ్యం పోషించే విధ్వంసకర పాత్రను ప్రశ్నిస్తుంది నవల.

గుడ్డెలుగును ఆడిస్తూ జీవికను సాగించే ఇమామ్ కుటుంబంలో షాదుల్ అనే గుడ్డెలుగు (ఎలుగుబంటి) ఒక సభ్యురాలు. కొడుకు చాంద్‌తో సమానంగా దాని ఆలనాపాలనా చూసిన ఇమామ్ భార్య, కొడుకులో వచ్చిన మార్పును చూసి తట్టుకోలేకపోతాడు. సంచార జీవితం నుంచి స్థిర జీవితాన్ని ఏర్పరచుకోవడానికి రెండెకరాల భూమి ఇస్తామన్న ఆశ స్థానిక ఎస్ఐ కల్పించటంతో పాటు ఒక షరతు విధిస్తాడు. అదేమిటంటే జంతువులను ఆడించడం చట్టవిరుద్ధం కాబట్టి ఆ గుడ్డెలుగును వదిలించుకోమంటాడు. తల్లీకొడుకు ఏకమై ఇమామ్ మీద గుడ్డెలుగును చంపేసయినా వదిలించుకోవాలని ఒత్తిడి తెస్తారు. ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఇమామ్ గుడ్డెలుగును తీసుకుని అడవికి వెళ్లిపోతాడు. తిరిగి రాడు. రచయిత కథను ఇక్కడితే ముగిస్తాడు.

ఒక అద్భుతమైన మానవీయ విలువలున్న వ్యక్తిగా ఇమామ్‌ను రచయిత తీర్చిదిద్దిన విధం పాఠకుల్ని అబ్బురపరుస్తుంది. సంచార జాతుల జీవనవిధానంలోని శ్రమసౌందర్యాన్ని ఎంతో సౌకుమార్యంతో ఆవిష్కరిస్తారు. షాదుల్ (గుడ్డెలుగు)ను సాకిన తీరు, అడవి జంతువును మచ్చిక చేసుకునే విధానం, అడవి జంతువుతో ఒక కుటుంబానికుండే అనుబంధం వంటి అంశాల్ని స్పృశించే క్రమంలో నైపుణ్యమున్న చిత్రకారుడిలా రచయిత కనిపిస్తాడు. షాదుల్ (గుడ్డెలుగు)ను కాపాడుకోవడంలో ఇమామ్ పడిన కష్టం, బాధ. దిగులు, తాపత్రయం చదువరిని ఓ పట్టాన వదలవు. ఇమామ్‌లాంటి వ్యక్తులు అదృశ్యమైనపోతున్న ఈ తరుణంలో మనకూ ఓ ఇమామ్ అండ కావాలనిపిస్తుంది. సంచార జీవనంలో మనిషికి జంతుపుకు వుండే అనుబంధంతో పాటు అభివృద్ధి పేరుతో జరిగే విధ్వంసం మనిషిలోని మనిషితనాన్ని ఎలా కబళిస్తుందో ఆర్ద్రతతో చెపుతుంది జిగిరి నవల. ఇమామ్ ఆత్మీయ పరిమళం మనల్ని కమ్మేసి ఓ పట్టాన వదలదు. అరుదైన దృశ్య కావ్యమీ నవల.

జిగిరి (నవల), పెద్దింటి అశోక్ కుమార్, వెల రూ. 75, ప్రతులకు నవోదయ బుక్ హౌస్, కాచిగుడా చౌరస్తా, హైదరాబాద్

- రాంబాబు

పాలపిట్ట మాసపత్రిక సౌజన్యంతో....

English summary
Rambabu reviews Peddinti Ashok kumar novel Jigiri, which was written on the lives of nomadic tribe. Peddinti Ashok Kumar has written few more novels and several short stories in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X