వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నం‘ధన’వనము

|
Google Oneindia TeluguNews

Chintapatla Sudarshan
‘ఆరింటికి అక్కడుంటాను'
‘ఇంపాజిబుల్ సిటీలో ట్రాఫిక్ టైమ్'
‘ఛాలెంజ్'
‘నీ స్పీడ్ తెల్సులే. వచ్చినా వస్తావ్ ఆక్సిడెంట్ అవకపోతే'
‘యూ.. వీకెండ్ ఎంజాయ్ చేద్దాం. రెండ్రోజుల్దాకా సిస్టమ్ కేసి చూసేదేలేదు'
‘నా మొహం చూస్తూ కూచుంటావా. హైదరాబాద్‌లో యింకా ఏమున్నయి చూడ్డానికి టాంక్‌బండ్, ఇందిరా పార్కు, లుంబినీ పార్కు, దుర్గం చెరువు, శిల్పా రామం, ఐమాక్స్, గండిపేట్, చార్మినార్...'
‘టెర్రా బైట్స్‌లో వుందినీ మెమరీ. ఈసారి ‘ఇనార్బిట్'కి వెళ్దాం. లెటజ్ షాప్'
‘షాపింగా! నన్ను భరించలేవులే. దివాలా తీస్తావు'
‘నువ్వు సెల్లో మాట్లాడుతుంటే నీ పెదాలు...'
‘బటర్ ఫ్లై వింగ్స్‌లా కదుల్తున్నాయంటావు. కొత్తగా థింక్ చెయ్యి'
‘అక్కడికొచ్చి చెప్తా'
‘వద్దురా.. సారీ... ఈసారికి...'
‘ఎందుకొద్దు. ప్లీజ్.. నువ్వు షాపింగ్ వద్దంటే ఓ.కె. వద్దు. పోనీ సిల్వర్ పిష్ అపార్ట్‌మెంట్ ఫోర్త్ ఫ్లోర్ ఫోర్‌నాట్ టూలో జస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఒకళ్లనొకళ్లం చూసుకుంటూ...'
‘నువ్వు.. నన్ను.. చూస్తూ.. వూరికే.. వుంటావ్.. నీ చేతులు ఒక్క సెకన్ కూడా పని లేకుండా వుండవే.. జోకులొద్దు. నువ్వసలు ఈ వీక్ రానేవద్దు. సారీ అన్నానుకదా'
‘నువ్వేమన్నా సరే నేను మాత్రం వచ్చేస్తున్నా'
‘వదన్నాను కదా. బస్టాండ్‌కి బయలుదేరుతున్నా.. మా వూరెళ్తున్నాను'
‘షాకింగ్ న్యూస్! మార్నింగ్ మొబైల్లో చెప్పలేదు. యూ బ్యూటీఫుల్ డెవిల్'
‘డాడీ లాస్ట్ వీకే ఫోన్ చేశారు. డిసైడ్ చేసుకోవడానికి టైమ్ పట్టింది'
‘ఇంత సడెన్‌గా.. ఎందుకో?'
‘చెప్తే ఏడుస్తావు. చెప్పకపోతే చంపుతావు. పెళ్లి చూపులు'
‘వ్వాట్? ఎవరికి?'
‘నన్ను చేసుకుందామనుకుంటున్న వాడికి'
‘నిజమా! ఇప్పుడేం చెయ్యాలి. వాడునీకు నచ్చుతాడేమో!'
‘వాడికి మాత్రం నేను తప్పకుండా నచ్చేస్తాను'
‘మరి నేను.. నేనేమవ్వాలి?'
‘డోంట్ వర్రీ.. వాడు నాకునచ్చడు కదా'
‘మై స్వీట్ ఏంజిల్'
‘ఓసారి డెవిల్.. మరోసారి ఏంజిల్... నీ ఇష్టం వచ్చినట్టు పిలు. వచ్చాక చెప్తా.. టైమవుతోంది. వుంటా! థాంక్స్ ఫర్ కాలింగ్ బట్ నాట్ కమింగ్... బై'

ఆ ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు. హైటెక్ సిటీ మైండ్ స్పేస్ బిల్డింగ్‌లో రెండు వేరు వేరు కంపెనీల్లో సిస్టమ్స్‌తో, లాప్‌టాప్‌ల్తో కుస్తీ పడుతుండే అనేక మంది యంత్రభూతముల కోరలు తోమే వాళ్లల్లో ఆ యిద్దరిదీ ఒక ‘పెయిర్'.

ఆక్సిడెంటల్‌గా కలిశారిద్దరు. కొద్ది రోజులు ఒకరి నొకరు చూసుకున్నారు. ‘ఛాటింగ్‌'తో ‘ఎక్సయిట్' అయ్యారు. టాంక్‌బండ్‌లో బెంచీ మీద ఒకళ్లనొకళ్లు తాకారు ఆక్సిడెంటల్‌గా కాదు. బైక్ మీద ఆమె చెయ్యి గులాబీ కొమ్మయి అతని వీపుని చుట్టుకుని మెత్తగా మెత్తగా గుచ్చుకుంది. ఇందిరా పార్కులో వాళ్ల పెదాలు ఫ్రెండ్సయ్యేయి. దుర్గం చెరువులో ఓ సాయంత్రం సూర్యూడు ఆరెంజ్ కలర్‌లో మునిగిపోతున్నప్పుడు వాళ్లకు తమ బాడీ లాంగ్వేజ్ బాగా అర్థమయ్యింది.

ఆఫీసులో లేటయితే సిటీకి దూరంగా వున్న తన ఫ్లాట్‌కి వెళ్లడానికి బదులు ‘అజయ్' అమీర్‌పేటలో వున్న ‘దీప్తి' అపార్టుమెంట్‌కి వెళ్లేవాడు. వాళ్లిద్దరూ ఒకరి వెచ్చదనంతో మరొకరు చలికాచుకుంటూ, ఒకరి వూపిరిని ఒకరు వాడుకుంటూ, ఒకరికి ఒకరుగా, ఇద్దరూ ఒకటేగా మూడు పిజ్జాలు ఆరు బర్గర్లుగా, బ్లడ్ అండ్ ఫ్లెష్ వున్న ఆడామగాగా గడిపేస్తూ రెండు కాలెండర్లు మార్చారు.

దీప్తి వూరెళ్లిన్నాటి రాత్రి పబ్ ఫ్రెండ్స్‌తో ‘చిమ్నిక్ అండ్ బాటిల్స్'లో ఎంజాయ్ చేద్దామనుకున్న అజయ్ అర్జంటుగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఫ్లైటెక్కాడు.

‘ఎప్పుడొచ్చావ్. అబ్భ. యిప్పుడుంది కూల్‌గా. నీ గొంతు వింటే ఎంత రిలాక్సవుతానో'

‘దీప్తీతో గేమ్స్ వద్దు. నేను వూరెళ్లిన్నాడే నువ్వు ఎక్కడికెళ్లావు?'
‘నేనా! ఎవరన్నారు?'
‘నాకూ వున్నారు. ఇన్ఫార్మర్లు...'
‘లివిట్.. నీ సంగతి చెప్పు. వాడికి నువ్వు నచ్చావా? కళ్లు తిరిగి పడిపోయేడా?'
‘కళ్లు తిరిగేవుంటయి కానీ పడిపోలేదు లే. నచ్చే వుంటాను'
డాడీ యేమంటున్నాడు?
‘ఏముంది. ముహూర్తాలు చూస్తున్నారు. బెస్ట్ మేచ్ అంటున్నారు. సూపర్ జాబ్. గ్రీన్ కార్డు హోల్డర్'
‘అయితే నేనవుటన్న మాట'
‘షటప్'
‘టెన్షన్‌కి అటాక్ వచ్చేట్టుంది'
‘డైలాగులొద్దు. నీ సంగతేమిటో చెప్పు. అంత అర్జంట్‌గా ఎక్కడికి వెళ్లేవు?'
‘అర్జెంట్‌గా కాదు. ఆక్సిడెంటల్‌గా... నాకూ పెళ్లి చూపులే'
‘పెళ్లి చూపులా?'
‘ఏం.. నేను చూడకూడదా?'
ఎందుకు చూడద్దు. నా వెంటున్నప్పుడే నీ కళ్లు ఎక్కడెక్కడ చూస్తాయో! చూశావా?
‘చూశాను. తప్పలేదు'
‘అమ్మాయి నచ్చిందా? బ్యూటిఫుల్ డెవిలా? స్వీట్ ఏంజిలా'
‘ఆమెకి నేను నచ్చాలి. హైలీ రిచ్ ఫ్యామిలీ..ఓవ్.. యూకాంట్ గెస్...'
‘అఛ్చా! ఈ దీప్తిని మరచిపోయింకా.'
‘యేమంటున్నావు..మూసుకో!'
నాలుగయిదు వీకెండ్లు గడిచిపోయాయి. అజయ్ ప్రాజెక్టు కంప్లీటవబోతుంటంతో బిజీ బిజీగా వున్నాడు. దీప్తి పాస్‌పోర్ట్ పనిలో బిజీ బిజీగా వుంది. ఎయిర్‌టెల్, ఐడియా ఒకదానికొకటి తారసపడలేదు. టాంక్‌బండ్‌లో అజయ్, దీప్తి కూచునే బెంచీని మరో జంట తమ ఫస్ట్ లవ్‌కి వుపయోగించుకుంటోంది. ఇందిరా పార్కులో, దుర్గం చెరువులో వీళ్ల ప్రైవేట్ స్థలాన్ని మరో జంట కబ్జా చేసింది. సిస్టమ్‌లో చాటింగ్‌కి అజయ్ పేరు కానీ దీప్తి పేరు కానీ ‘గ్రీన్ లైట్'లో కనిపించడం లేదు. సెల్‌ఫోన్‌లు ఏ టైంలోనైనా మీరు కాల్ చేస్తున్న వినియోగదారుడు ప్రస్తుతం అందుబాటులో లేడని లేదా కవరేజి ఏరియాలో లేరని, స్పందించుట లేదని, స్విచ్ ఆఫ్ చేసి వున్నారని అంటున్నవి.

ఒక బర్త్ డే పార్టీకి ‘చిల్లీస్'లో కలిశారిద్దరూ. వీళ్లిద్దరూ ఒకరికి ఒకరు బాగా తెలుసుని యేమాత్రం తెలీని ఒక జెంటిల్మెన్ ఒకరికి ఒకర్ని ఇంట్రడ్యూస్ చేశాడు.

‘దీప్తి! మీట్ మై ఫ్రెండ్ అజయ్, ఐబియమ్.'
‘హాయ్!'
‘అజయ్! దిసీజ్ దీప్తి, ఒరాకిల్.'
‘హాయ్!'
పెరిగిన అజయ్ గడ్డం చూసి ‘ఐ పిటీయూ' అనుకుంది దీప్తి. ఆమె బ్లాంక్ ఫేస్ చూసి యిదివరకులా ఏక్టివ్‌గా లేదు అనుకున్నాడు అజయ్.

ఒక కూల్ డ్రింక్ ఒక స్ట్రా బదులు రెండు కూల్ డ్రింక్‌లు రెండు స్ట్రాలతో ఖాళీ చేసి రొటీన్‌గా ‘బై' చెప్పుకున్నారు.

‘సారీ! అజయ్ బిజీగా వున్నాను. అందుకే కాంటాక్ట్ చెయ్యలేకపోయాను'
‘నాకూ హెవీ వర్క్! ఫోన్ చెయ్యలేదు'
‘హౌ ఆర్ యూ అజయ్. గడ్డం పెంచావ్. టెన్షనవకు టేక్ కేర్'
‘గడ్డం నీ కోసమేం కాదు. అయాం ఓకే. నువ్వే పాపం అనిపించింది'
‘నాకేం? అయామ్ ఆల్ రైట్'
‘బర్త్ డే పార్టీలో ‘డల్'గా కనిపించావు'
‘ఆఫీసునించి వచ్చాను కదా! నో ప్రాబ్లమ్. లైఫ్ ఈజ్ అడ్జస్ట్‌మెంట్ బట్ లైఫ్ లాంగ్ నిన్ను మరిచిపోలేను'
‘ఎగ్జాట్లే! ఎప్పుడూ నువ్వే గుర్తుకొస్తుంటావు'
‘నా వెడ్డింగ్ కార్డు మెయిల్ చేస్తాను. నువు చాలా బిజీ కదా.. రాలేవు'
‘ఆల్‌రెడీ నా వెడ్డింగ్ కార్డు కొరియర్ చేశాను. నేను రాలేక పోతే నువు మాత్రం వస్తావా'
‘బై'
‘గుడ్ బై'.

- చింతపట్ల సుదర్శన్

English summary
Prominent Telugu short story writer Chintapatla Sudarshan explained about the importance of money in his short story.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X