• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రజారాజ్యం

By Staff
|

అస్తిత్వంలేని నేను

ప్రకృతి సౌందర్యంలో సమాగమం

నాగలి పట్టి కోండ్ర వేస్తే

సహకరించిన నేలచాలు చూపులాచక్కగా

ఇరువాలు దీసి విత్తనం నాటితే

మబ్బులు పులకరించి వానలు

ధారలు పోసే అమ్మ ప్రేమలా

ముసుగేసి నన్ను దాచేసుకున్న

పజ్జొన్న చేనులో గుంటుక

అధర్మనిధనం కోసం పరుగులుతీస్తున్న విజయరథంలా

నన్నందుకోమని పరాచికాలాడుతున్నఎదిగిన చేను వంగి

అలిగిన నా చెక్కిలి మీద చేసిన తీయనిముద్దు

ఐశ్వర్యం లేని నేను

స్వచ్ఛమైన ఆనందాల అమీరును

తలకు రుమాలు చుట్టి ముల్లుగర్రచేతపట్టి

ఆరిన ఆసామిలాల బాపు తోడుగాతిరగాడిన నేల

అమ్మతెచ్చిన దూపకు దించి

చింత చెట్టు నీడన కడుపుచల్లార్చుకున్న బాయి గడ్డ

అన్నతో ఆటలాడి, కొట్లాడి

ఆనందాలు కలబోసుకని

అమ్మతో తిట్లు తిన్న జాగ

అక్క కన్నుల్లో సద్దుల బతుకమ్మవెలుగుల కోసం

గునుగు పువ్వులకు రంగులద్దినకళల పుట్టిల్లు

ఊరు నుంచి బొడ్డు కోసుకుని

అమ్మానాన్నల అవశేషాలను గోరీని కట్టి

డిగ్రీల పట్టాల భేతాళాన్ని భుజానవేసుకుని

ప్రపంచబ్యాంకు ఫ్లై ఓవర్ల మీదజారిపోతున్న

కలల బేహారిని

గమ్యం లేని దేశద్రిమ్మరిని

వర్తమానాన్ని గతం చొక్కాకు తొడిగి

మూడు బాటల ముంగిట దిష్టిబొమ్మగ నిలిపి

కల్లం లేపుకుపోయిన కాలం

కాలం ఇరుసు మీద నలిగిన వయసు

మందు లేని మాయరోగాన్ని

మనింట్లోకి తెచ్చిన డంకెల్‌

గుడ్డలూడదీసి ఆడిన బరిబాతలతైతక్కలను

సౌందర్యాత్మక నవ్యతగా నిలిపినసరళీకరణ

పరాయాకరించిన పేటెంట్‌

గాట్‌ కరిచిన కాట్లకు

ఊరు ఊరంతా హైడ్రోఫోబియా

గ్లోబల్‌ విలేజి మంత్రానికి

పల్లె వల్లెకాడు

బాయి అడుగంటి

తెట్టె కూలి రాతికుప్పై

శిథిలావశేషంగా మోటబార్లు

లాలించి జోలపాడిన గుడిసెకు గుర్తుగా

సగం విరిగి పుచ్చిపోయిన నిట్టాడు గుంజ

వేళ్ల మొదళ్లతో సహా

వేలం పడ్డ మామిడితోట

నిండు పున్నమినాటి బొడ్డెమ్మలాముస్తాబయ్యే

తరాల వారసుల గోరీల దడి

దొంగలు దోచిన కల్లంలా

బాయి గడ్డ మీద నిలబడి

అరచేయి అడ్డం పెట్టి చూసినకనుచూపు మేరంతా

జడలు విరబోసుకున్న క్రూర సర్కారుతుమ్మ

చుట్టూ చెట్ల ఆలింగనంలో హొయలు వోయేపర్రె

ఇప్పుడు పందులు దొర్లినబొందలగడ్డ

అవునూ?

ఈ బాధ ఒక్క బొందుగులదేనా?

ఈ కథంతా ఒక్క కొట్టనంపుబాయిదేనా?

ఈ పరాయాకరణ విషం కోరల్లోనేనొక్కణ్నేణా?

-డా॥కె. లింగారెడ్డి

 • చారెడుభూమి కోసం

 • నడిచెక్కుతిరుపతి కొండ

 • సంజీవిపుల్ల

 • అసమాపకక్రియ

 • పహారా

 • యాది

 • మాయ

 • మేట్రిక్స్‌

 • నీకేమెరుక?!

 • పుటం

 • ఒంటరిగుంపు

 • చిరునవ్వు

 • ఇన్సానియత్‌

 • అమ్మ

 • మావూరి పూల మొక్క

 • భూమిభాష

 • జలపాతం

 • ఒకానొకరాత్రి న్యూయార్క్‌లో...

 • జంతర్‌మంతర్‌ పెట్టె

 • బాపూ!నన్ను మన్నించు!!

 • ఈదీ

 • మళ్లీపిట్టలొస్తాయి

 • సిరాచుక్క

 • సశేషం....

 • పిల్లలునిద్దరోతున్నారు

 • నేనుబహువచనం

 • అటువైపుకి

 • వెనిజులా!వెనిజులా!

 • మ్యారేజ్‌

 • పరాయికరణ

 • ఉనికి

 • నేను

 • తెలంగాణకాశ్మీరు కాదు!

 • హైకూలు

 • చకోరాలు

 • మావూరు

 • అమృతం

 • అమెరికా- చమురు

 • రోడ్డు

 • లతీఫ్‌- సామేలులు

 • రూట్స్‌

 • మర్ఫా

 • పాషాణం

 • గుడ్లగూబ

 • మొగిలిచెర్ల

 • నాకలల పునాదులు

 • విజయంగొడ్డలిది కాదు చెట్టుదే

 • చేలోకిపురుగులొస్తున్నాయి

 • సహజీవనంవర్ధిల్లు గాక!

 • మొబైల్‌పక్షులు

 • చెలిమి

 • క్షీరదాలు

 • ఉభయచరాలు- అండజాతులు

 • డివైన్‌రోమాన్స్‌

 • కొత్తపుట్టుక

 • సంకల్పబలం

 • సముద్రజీవులు

 • ఎలానడుస్తావో

 • వానకిటికీ

 • విశ్వమానవత

 • చిలుక

 • మబ్బులు

 • ఆగంతకుని స్వప్నం

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X