జిలేబి రేసు
దారం ఎగురతనే ఉంటది
తీరం దగ్గరనే కనవడుతది
వేలి కొసల పనితనం మనుసున పడుతనే ఉంటది
అంతా అందినట్టే ఉంటది
అంతా అయిపోయినట్టే అనిపిస్తది
ఆట నడుస్తనే ఉంటది
గమ్యం కనవడుతనే ఉంటది
గుర్రం ఉర్కుతనే ఉంటది
మర్మం ఎర్కవుతనే ఉంటది
చెవుల కాడ సప్పుడు చేసి
ఎదురుంగనే లైను కడుతరు
దొంగ తెలుస్తనే ఉంటడు
ఒకడు వాడని సూపిత్తడు
ఒకడు వీడని నిలవెడుతడు
ఇంకొకడు అయ్యనే అంటడు
మరొక్కడు కాదు అవ్వనే అంటడు
అంతా పెండలబుర్రి గాని ఆట
బైండ్లోల్ల జముకు సప్పుడుకు
ఎల్లవ్వ తల్లి ఎగిరినట్టు ఎగురతనే ఉన్నం
మీ మంత్రాలు తంత్రాలు బైటవడ్డయి
ఎల్లవ్వ తల్లి కండ్లెర్ర జేసింది
ఇగ మీ సంచులు సదురుకోండ్రి బిడ్డా












Click it and Unblock the Notifications