గాలిదీపం

నిన్నొక పాటను చేసి తీసుకుపోయింది
నిన్నా మొన్నలోనే జ్ఞాపకం...
నువ్వొక ముడుచుకుని పడుకున్న వాక్యం
చతురస్రంగా ఊయలూగే మాట
అమాంతంగా పగిలిన వెన్నెలద్దం...
లోనలోపల బాధను గీస్తున్న
ఇనుప ముక్కతో ఎలా చెప్పుకోను
లోన వెలుపల నిప్పును చే పన్నిన
మంచు కత్తితో ... నడకలెలాగ...
చెబ్తున్న కొద్దీ... పెరుగుతుంది... శోకం
క్షణక్షణం పెరిగే అంతరంగం డెబ్రిస్
దూరమైనా... క్రూరం కాకు... నీకు...
రాకపోయినా ఎగిరిపోకు... నాకు...
నీలం లోలాకులతో చందమామ
నీలాగే ముఖం తిప్పుకుంది
నా చుట్టూ నడిచిన కాలం
నిప్పంటించుకుంది
ఎవరూ నడవని రేగు ముండ్ల దారిలో
ఇద్దరమూ నడుస్తున్నాం ఎదురెదురుగా
చిందోళ్లమై... ఒగ్గోళ్లమై...
విడిపోయి కలుస్తున్నామూ...
ఈ పెనుగాయపు రైలు
ఎక్కడా ఆగదా...












Click it and Unblock the Notifications