కొందరంతేనేమో...

Posted By:
Subscribe to Oneindia Telugu

తెలుగు కవిత: కిస్మత్

సంతోషం పక్కనున్నా సంబురపడరు
కొమ్మ వంచినా పువ్వులు తెంపరు
కొందరంతేనేమో...
నవ్వుల తోటల్లో విషాదమాలలల్లుతరు
తేనె పూసిన కత్తులకే బొండిగెలనిత్తరు
కొందరంతేనేమో...
నీటిమీది రాతల్నే నిజమనుకుంటరు
నీతిగా బతికెటోల్లకు నీళ్లొదులుతరు
కొందరంతేనేమో...
స్వచ్ఛమైన ప్రేమల్ని చూసి వెకిలిగా నవ్వుతరు
పాలనురగలపై తేలి జీవితమనుకుంటరు
కొందరంతేనేమో...
ఒప్పుకోలేని నిజాల్ని గొంతులోనే పూడ్చిపెడుతరు
మనసుకు నల్లని ముసుగేసుకుని తిరుగుతరు
కొందరంతేనేమో...
ఆశలపై నీళ్లుజల్లి నిబ్బరంగా నిలబడుతరు
ఆకురాలిన చెట్టులా ఆవేదనతో కుమిలిపోతరు
కొందరంతేనేమో...
అడవుల్ని ఆయుధంలా మెరిపిత్తరు
ఆలోచనల్ని ఆచరణలో సూపిత్తరు
కొందరంతేనేమో...
కన్నీళ్లనే ఖాయిసుపడి ప్రేమించుతరు
కష్టాలొచ్చినప్పుడే కలిసి నడుత్తరు
కొందరంతేనేమో...
మానవత్వమై నిలబడి మనిషితనాన్ని పెంచుతరు
మనిషిగా పుట్టి మహనీయులై నిలిచిపోతరు

- బండారి రాజ్‌కుమార్

bandari

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Telugu poet bandari Rajkumar expressed his feeling about the nagetive thinkng people.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి