కవి స్వరం: శ్రీనివాసు గద్దపాటి
కవి తాత్వికుడు కావాల్సిందే. తాత్వికుడికి నిత్య అన్వేషణ, నిత్య శోధన సత్యాన్ని కనిపెట్టడానికి ఓ సాధనం. ఆ తాత్విక నేపథ్యమే మనిషిని కవిగా రూపుదిద్దుతుంది. కొన్ని సంఘటనలను మరిచిపోతుంటాం, కొన్ని సంఘటనలు అలాగే మదిలో ఉండిపోతాయి. వాటిని ఒడిసిపట్టుకోవడం ఓడిపోవడం ఓ లక్షణం.
జీవితమంటే కూలిపోయిన ఇసుక గూళ్లను మళ్లీ నిర్మించుకోవడమే అంటాడు శ్రీనివాస్ గద్దపాటి తన కవితలో. అంటే, పగిలిన స్వప్నాలను తిరిగి అతికించుకోవడం కూడా. జీవితంలో పోగొట్టుకున్నదాని తిరిగి పొందడం అనే అర్థం ఈ కవితా వాక్యాల్లో కనిపిస్తున్నది.

కరిగిపోయిన క్షణాలన్నీ.../ ఏటి గుడ్డున గువ్వల్లోనో/ పగిలిన ముత్యపు చిప్పల్లోనో.. / వెతుక్కోవడమే అని శ్రీనివాస్ అంటున్నాడు. అంటే నిత్యం అన్వేషణ, దేవులాట మాత్రమే సత్యం, మిగతాదంతా అబద్ధమని కవి చెప్పదలుచుకున్నాడు.
- కాసుల ప్రతాపరెడ్డి
జీవితం
కొన్ని క్షణాలు అలా జారి పోతుంటాయి
జీవితపు వేళ్ళ సందుల్లోనుండి
అర్థరాత్రి అకస్మాత్తుగా
భయంకరమైన పీడకలలా
ఇంకొన్ని క్షణాలు అలానే
అతుక్కొని ఉంటాయి వ్రేళ్ళ చివర్లో
ఒడిసిపట్టుకునే ప్రయత్నంలో
ప్రతీసారీ ఓడిపోతూనే ఉంటాను
ఇప్పుడో ధర్మ సూక్ష్మం తెలిసినట్లే
పోయిన క్షణాల జాడలేవో.....
కొత్తదారులు వేసుకుంటూ పోతాయి
సముద్రం ఒడ్డున నిర్మించుకున్న దారులన్నీ
అలల తాకిడికి అదృశ్యం అవుతాయి
జీవితమంటే కూలిపోయిన ఇసుకగూళ్ళను
మళ్ళీమళ్ళీ నిర్మించుకోవడమే...
కరిగిపోయిన క్షణాలన్నీ..
ఏటి ఒడ్డున గవ్వల్లోనో..
పగిలిన ముత్యపుచిప్పల్లోనో..
వెతుక్కోవడమేనేమో....
- శ్రీనివాసు గద్దపాటి
13.07.2014
కవిసంగమం కోసం ఇక్కడ క్లిక్ చేయండి












Click it and Unblock the Notifications