రక్త చంద్ర గ్రహణం- అయిదు ఆసక్తికరమైన విషయాలు..!!
Lunar eclipse 2025: నేడు చంద్ర గ్రహణం ఏర్పడబోతోంది. ఇది- పౌర్ణమి రోజున రాహుగ్రస్త కాలంలో శతభిష నక్షత్రంలో ఏర్పడనున్న సంపూర్ణ చంద్ర గ్రహణం. 2022 తరువాత ఇలాంటి ఘటన సంభవించబోతోండటం ఇదే తొలిసారి. ఆ రోజు నుంచే పితృపక్షం ఆరంభం కాబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఈ గ్రహణం కనువిందు చేయనుంది.
రాత్రి 9:57 నిమిషాలకు గ్రహణ కాలం ఆరంభమౌతుంది. 82 నిమిషాల పాటు కొనసాగుతుంది. అత్యంత సుదీర్ఘ గ్రహణ కాలం ఇది. 11 గంటల సమయానికి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. 11:42 నిమిషాలకు చంద్రుడు పరిపూర్ణంగా గ్రహణ ఛాయలోకి వెళ్లిపోతాడు. అర్ధరాత్రి దాటిన తరువాత 12:22 నిమిషాలకు గ్రహణం విడుస్తుంది. వేకువ జామున 1:26 నిమిషాలకు గ్రహణం పూర్తిగా వీడిపోతుంది.

- ఢిల్లీ, చండీగఢ్, జైపూర్, లక్నో, ముంబై, అహ్మదాబాద్, పూణే, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి, కోల్ కత, భువనేశ్వర్, గౌహతి, భోపాల్, నాగ్‌పూర్, రాయ్‌పూర్ వంటి నగరాల్లో ఈ గ్రహణం కనిపిస్తుంది. సూర్యుడు, చంద్రుని మధ్య భూమి నేరుగా ప్రయాణిస్తుంది. ఆ సమయంలో చంద్రుని ఉపరితలంపై భూమి ఛాయ పడుతుంది. ఆ సమయంలో చంద్రుడు ఎరుపు-నారింజ రంగులో కనువిందు చేస్తాడు.
- భారత్ సహా ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియా, తూర్పు ఆఫ్రికా దేశాల్లో ఈ గ్రహణం పూర్తిగా కనిపిస్తుంది. యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికాలో పశ్చిమ, దక్షిణ అమెరికాలో తూర్పు, పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం, ఆర్కిటిక్, అంటార్కిటికా పరిధుల్లోని అన్ని దేశాలు ఈ చంద్రగ్రహణాన్ని చూడగలవు.
- చంద్రగ్రహణాన్ని వీక్షించడానికి ఎటువంటి రక్షణ పరికరాలు అవసరం లేదు. నేరుగా చూడొచ్చు. చందమామపై ఉన్న బిలాలు, ఉపరితలం, అక్కడి పరిస్థితులు, ఎరుపు- నారింజ రంగులను మరింత లోతుగా తిలకించాలంటే మాత్రం బైనాక్యులర్స్ లేదా స్పేస్ టెలిస్కోప్ లను ఉపయోగించవచ్చు. దీన్ని చిత్రీకరించడానికి, డీఎస్ఎల్ఆర్ లేదా స్మార్ట్‌ఫోన్ కు ట్రైపాడ్‌పై అమర్చాలి. 1-2 సెకన్ల లాంగ్ ఎక్స్‌పోజర్లు ఉంటే మంచి వీడియో తీయవచ్చు.
- ఈ చంద్రగ్రహణానికి బడ్ల మూన్ గా పిలుస్తోన్నారు. ఎరుపు రంగు 'రేలీ స్కాటరింగ్' అనే దృగ్విషయం వల్ల ఇది ఏర్పడుతుంది. సూర్యరశ్మి భూ వాతావరణం గుండా వెళుతున్నప్పుడు, నీలి రంగు తరంగ దైర్ఘ్యాలు చెల్లాచెదురవుతుంటాయి. ఎరుపు రంగులో ఉండే తరంగదైర్ఘ్యాలు చంద్రుడిని చేరుకుంటుంటయి. ఈ ప్రక్రియ చంద్రుడి ఉపరితలంపై ఎరుపు రంగును సృష్టిస్తుంది. అందుకే దీన్ని మూన్ ఎఫెక్ట్ అని అంటారు.
- భూమికి సంబంధించిన యాంబ్రల్ షాడోలో వెళ్తాడు చంద్రుడు. దీనివల్ల సాధారణంగా కంటే కూడా ఎరుపు రంగు మరింత ముదురుగా కనిపిస్తుంది. నిండుగా ఉంటుంది. ఈ గ్రహణం చాలా అద్భుతంగా ఉంటుందని స్కైగేజర్స్ చెబుతున్నారు. భూమికి అత్యంత సమీపంలో ఉండే 'పెరిజీ'కి చేరుకోవడానికి అతి సమీపంలో సంభవిస్తోన్నందున చంద్రుడు సాధారణం కంటే కొంచెం పెద్దగా, మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాడు.
More From
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications