Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇదే రైట్ టైం: కార్ లవర్స్‌కు డబుల్ ధమాకా!

Diwali Car Discount Offer 2025: ప్రస్తుతం కొత్త కారు కొనాలని చూస్తున్న వారికి ఇప్పుడు ఓ లాటరీ తగిలినట్లే.దీపావళి కార్ డిస్కౌంట్ ఆఫర్ 2025తో ఈసారి కారు కొనుగోలుదారులకు రెట్టింపు లాభం లభిస్తోంది. టాటా నెక్సన్, హోండా ఎలివేట్, మారుతి బ్రెజా వంటి అనేక ప్రముఖ కార్లపై కేవలం జీఎస్టీ కోత మాత్రమే కాక, ఫెస్టివల్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ ఆఫర్ల రూపంలో భారీగా డబ్బు ఆదా చేసుకునే అవకాశం ఉంది. నవరాత్రి, దుర్గా పూజల అనంతరం ఇప్పుడు దీపావళి పండుగ వస్తుండటంతో జీఎస్టీ 2.0 అమలు కారణంగా ధరలు తగ్గిన కార్లపై ఆటో కంపెనీలు అదనపు డిస్కౌంట్లను అందిస్తున్నాయి. కారు కొనుగోలు చేయడానికి అత్యంత అనుకూలమైన టైంగా మారింది.

టాటా నెక్సన్‌పై అత్యధికంగా ఆదా!
టాటా మోటార్స్ ప్రముఖ ఎస్‌యూవీ నెక్సన్ ఈసారి కస్టమర్లకు అత్యధిక ప్రయోజనం అందిస్తోంది. నెక్సన్‌పై మొత్తంగా రూ.2 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది.ఇందులో రూ.55 లక్షల వరకు జీఎస్టీ తగ్గింపు,దాదాపు రూ. 45,000 వరకు క్యాష్ డిస్కౌంట్, స్క్రాపేజ్ ఆఫర్, కార్పొరేట్ డీల్స్ ద్వారా అదనపు లాభం పొందవచ్చు.

Diwali Double Bonanza for Car Buyers Right Time to Buy as Nexon Gets Rs 2 Lakh Amaze Rs 1 60 Lakh Discount

హోండాలో డబుల్ ధమాకా ఆఫర్లు
హోండా ఈసారి ఎస్‌యూవీ (SUV), సెడాన్ (Sedan) విభాగాలలో అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది.

హోండా ఎలివేట్(Honda Elevate): ఈ ఎస్‌యూవీపై రూ.1.22 లక్షల వరకు లాభం పొందవచ్చు. ఇందులో రూ.91,100 జీఎస్టీ తగ్గింపు, దాదాపు రూ.31,000 వరకు డీలర్ బోనస్ ఉన్నాయి.

హోండా అమేజ్(Honda Amaze): సెకండ్ జనరేషన్ అమేజ్‌పై రూ.97,200 వరకు ఆఫర్ లభిస్తుండగా.. కొత్త థర్డ్ జనరేషన్ అమేజ్ టాప్-ఎండ్ ZX CVT మోడల్‌పై ఏకంగా రూ.1.60 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇందులో రూ.1.20 లక్షల జీఎస్టీ తగ్గింపు, రూ.40,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి.

మారుతి సుజుకి పూర్తి రేంజ్‌పై డిస్కౌంట్లు
మారుతి సుజుకి కూడా ఎంట్రీ-లెవల్ నుంచి ప్రీమియం కార్ల వరకు వినియోగదారులకు ఆఫర్లు అందిస్తోంది:

WagonR (వ్యాగన్ఆర్): ఈ కారుపై సుమారు రూ.75,000 వరకు ఆదా చేసుకోవచ్చు.

Baleno (బలెనో): కొనుగోలుదారులకు రూ.70,000 వరకు ప్రయోజనం లభిస్తుంది.

Brezza (బ్రెజా): మారుతి హిట్ ఎస్‌యూవీ బ్రెజాపై రూ.45,000 వరకు ఆఫర్ ఉంది. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ ఆఫర్ ప్రకటించడం విశేషం.

హ్యుందాయ్ ఎక్స్‌టర్‌పై ఆఫర్
హ్యుందాయ్ మైక్రో ఎస్‌యూవీ ఎక్స్‌టర్ (Hyundai Exter) పై కూడా బంపర్ డిస్కౌంట్లు ఉన్నాయి. ఏఎమ్‌టి (AMT), సీఎన్‌జీ (CNG) వేరియంట్లపై దృష్టి సారించిన కంపెనీ రూ.60,000 వరకు ప్రయోజనం అందిస్తోంది. జీఎస్టీ తగ్గింపులు, దీపావళి ఆఫర్ల కారణంగా ఎస్‌యూవీ, హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్... దాదాపు ప్రతి విభాగంలోనూ కారు కొనుగోలు చేయడం ఇప్పుడు మరింత సులభంగా మారడంతో పాటు చౌకగా మారింది. ఆటోమొబైల్ రంగంలో అమ్మకాలు పెరగడానికి, కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి ఇది గొప్ప అవకాశంగా నిలిచింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+