Earth: వేగంగా తిరుగుతున్న భూమి..! క్రమంగా తగ్గిపోతున్న రోజు సమయం..!
శాస్త్రవేత్తల తాజా అంచనా ప్రకారం భూమి భ్రమణ వేగం పెరుగుతోందని, దీనివల్ల రోజుల వ్యవధి తగ్గుతోందని తెలుస్తోంది.
వాతావరణంలోనే కాదు అంతరిక్షంలోనూ వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు తిరిగిన వేగంతో భూమి ఇప్పుడు కూడా తిరుగుతోందా అంటే కచ్చితంగా కాదని శాస్త్రవేత్తలు చెప్పేస్తున్నారు. అలాగే రోజు సమయం 24 గంటలే ఉందా అంటే అదీ లేదనే సమాధానమే వినిపిస్తోంది. శాస్త్రవేత్తల తాజా అంచనా ప్రకారం భూమి భ్రమణ వేగం పెరుగుతోందని, దీనివల్ల రోజుల వ్యవధి తగ్గుతోందని తెలుస్తోంది.
వాస్తవానికి భూమి తన చుట్టూ తాను తిరగడానికి దాదాపు 24 గంటలు పడుతుందనేది మనందరికీ తెలుసు. అయితే ఈ సమయాన్ని ఒక రోజుగా లెక్కిస్తారు. కానీ రాబోయే వారాల్లో భూమి మరింత వేగంగా తిరుగుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీనివల్ల పగటిపూట సమయం కొద్దిగా తగ్గుతుందని అంచనా. తాజాగా జూలై 9న భూమి వేగంగా తిరిగిందని నిర్దారించారు. జూలై 22, ఆగస్టు 5 తేదీల్లో చంద్రుని స్థానం భూమి భ్రమణాన్ని ప్రభావితం చేస్తుందనే అంచనా ఉంది. దీని కారణంగా ప్రతి రోజు సాధారణ సమయం 24 గంటల కంటే తక్కువగా ఉంటుందంటున్నారు. అయితే ఈ సమయం కేవలం 1.3 నుండి 1.51 మిల్లీ సెకన్ల వరకు మాత్రమే తక్కువగా ఉంటుంది.

సాధారణంగా చూస్తే భూమిపై ఒక పూర్తి రోజు 86,400 సెకన్లు లేదా 24 గంటలు ఉంటుంది. అయితే భూ భ్రమణం స్థిరంగా ఉండదు. చంద్రుడు, సూర్యుని గురుత్వాకర్షణ శక్తి, గ్రహం యొక్క అయస్కాంత క్షేత్రం, సహజ లేదా మానవ కార్యకలాపాల వల్ల భూమి ద్రవ్యరాశిలో వచ్చే మార్పులు దీనిపై ప్రభావం చూపుతుంటాయి. గతంలో భూమి భ్రమణం క్రమంగా తగ్గుతూ వచ్చిందని స్పష్టంగా తెలుస్తోంది. సుమారు 100 నుండి 200 కోట్ల సంవత్సరాల క్రితం ఒక రోజు 19 గంటలు మాత్రమే ఉండేది. ఎందుకంటే చంద్రుడు భూమికి చాలా దగ్గరగా ఉండటం వల్ల దాని గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా ఉండేది.
కాలక్రమేణా చంద్రుడు దూరం జరుగుతున్న కొద్దీ రోజుల వ్యవధి పెరిగింది. అదే సమయంల కొన్ని నిర్దిష్ట కాలాల్లో భూమి భ్రమణం పెరిగిందని తేల్చారు. 1970లలో కంటే 2020లో భూమి వేగంగా తిరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. జూలై 5, 2024న అత్యంత తక్కువ రోజుగా నమోదైంది. ఇది సాధారణం కంటే 1.66 మిల్లీ సెకన్లు తక్కువగా ఉంది. పలు కారణాల వల్ల కొన్ని రోజుల్లో చంద్రుని దూరం భూమి కక్ష నుండి మారడం వల్ల దీని భ్రమణ వేగం పెరుగుతుంది లేదా తగ్గుతుంది.

ఇది ఒక బొంగరం తన కక్షను మార్చినప్పుడు వేగంగా తిరగడం లాంటిదేనని వారు చెప్తున్నారు. మంచు కరగడం, భూగర్భ జలాలు కదలడం వంటి వాతావరణ మార్పులు కూడా భూమి భ్రమణంలో మార్పులు కలిగిస్తాయి. భూకంపాలు, కాలానుగుణ మార్పులు కూడా భ్రమణాన్ని ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా 2011లో జపాన్‌లో సంభవించిన భూకంపం ఒక రోజు సమయాన్ని 1.8 మైక్రో సెకన్లు తగ్గించింది.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications