Honor x7c 5g ఫీచర్లు మామూలుగా లేవు గురూ!
ప్రపంచంలో రోజుకో కొత్త ఫోన్ మార్కెట్ లోకి వచ్చేస్తోంది. ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టు కస్టమర్లను ఆకర్షించేందుకు దిగ్గజ కంపెనీలు సైతం పోటీపడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ మొబైల్ బ్రాండ్ హానర్ సైతం కొత్త కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ లను రిలీజ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం హానర్ మరో కొత్త బ్రాండ్ తో రాబోతుంది. గత నెలలో Honor X9c 5G ను భారత్‌లో విడుదల చేసిన తర్వాత, ఇప్పుడు మరో కొత్త 5G స్మార్ట్‌ఫోన్ - Honor X7c 5G ను తీసుకురాబోతోంది.
ఈ ఫోన్‌ను గత సంవత్సరం కొన్ని అంతర్జాతీయ మార్కెట్లలో లాంచ్ చేశారు, ఇప్పుడు భారత్‌లో కూడా ఆవిష్కరించడానికి కంపెనీ సిద్ధమవుతోంది. అమెజాన్ లైవ్ మైక్రోసైట్ ద్వారా కంపెనీ ఇప్పటికే టీజ్ చేయడం ప్రారంభించింది. ఈ Honor X9c 5G ఫోన్ ఫీచర్లు, ధర గురించి మీకోసం ప్రత్యేకంగా..

Honor X7c 5G స్పెసిఫికేషన్లు..
డిస్‌ప్లే..
- 6.77 అంగుళాల HD+ డిస్‌ప్లే
- 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్
- పెద్ద స్క్రీన్ వల్ల గేమింగ్, వీడియోలు, బ్రౌజింగ్‌కు మంచి అనుభవం.
ప్రాసెసర్..
- Qualcomm Snapdragon 4 Gen 2 చిప్‌సెట్
- శక్తివంతమైన పనితీరుతో మల్టీటాస్కింగ్ మరియు గేమింగ్‌కు అనుకూలం
RAM & స్టోరేజ్..
- 8GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజ్
- Honor RAM Turbo టెక్నాలజీ ద్వారా అదనంగా 8GB వర్చువల్ RAM
- మొత్తం 16GB RAM సమాన పనితీరు
కెమెరా..
రియర్ కెమెరా సెటప్ :
- 50MP ప్రైమరీ లెన్స్
- 2MP డెప్త్ సెన్సార్
- LED ఫ్లాష్ సపోర్ట్
ఫ్రంట్ కెమెరా :
- 8MP సెల్ఫీ కెమెరా
- వీడియో కాలింగ్ & సోషల్ మీడియా కంటెంట్ కోసం క్లియర్ అవుట్‌పుట్
బ్యాటరీ..
- 5200mAh భారీ బ్యాటరీ
- 35W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
- 59 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్
- 24 గంటల వరకు ఆన్‌లైన్ వీడియో స్ట్రీమింగ్
- Ultra Power Saving Mode - కేవలం 2% బ్యాటరీతో కూడా 75 నిమిషాల నిరంతర కాలింగ్
ఆపరేటింగ్ సిస్టమ్..
- Android 14 ఆధారిత MagicOS 8.0
- కొత్త UI ఫీచర్లు మరియు కస్టమైజేషన్ ఆప్షన్లు
సెక్యూరిటీ..
- 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్
- వాషబుల్ వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్
- ప్రతిరోజూ ఉపయోగంలో అదనపు భద్రత
ఆడియో..
- డ్యూయల్ స్పీకర్లు
- 300% Ultra High Volume సౌండ్ టెక్నాలజీ
- క్లియర్, లౌడ్ ఆడియో అనుభవం
కలర్ ఆప్షన్లు..
- Forest Green
- Moonlight White
మొత్తానికి పెద్ద బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, శక్తివంతమైన ప్రాసెసర్, 120Hz డిస్‌ప్లే.. వంటి ఫీచర్లతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో మంచి పనితీరు, ఫీచర్లు, స్టైల్ అందించడం మంచి ఛాయిస్ అని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications