Navi: ప్రత్యర్థి 'క్రెడ్‌'కు చుక్కలు చూపిస్తున్న నవీ.. పరిమితులు విధించినా నో బ్యాక్ స్టెప్

Cred: ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకుడిగా ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త సచిన్ బన్సాల్ బిజినెస్ సర్కిల్‌లో ఎంతో ఫేమస్. 2018లో వాల్‌మార్ట్ డీల్ తర్వాత కంపెనీ నుంచి వైదొలిగారు. అనంతరం 'నవీ' పేరిట ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీని స్థాపించారు. ఇది లోన్స్, మ్యూచువల్ ఫండ్స్, హెల్త్ ఇన్సూరెన్స్ సహా UPI సేవలను అందిస్తుంది. తాజాగా ప్రత్యర్థి 'క్రెడ్' గట్టి షాక్ ఇచ్చి వార్తల్లో నిలిచింది.

ఫిన్‌టెక్ యాప్ నవీ అంతకు ముందు నెలతో పోలిస్తే అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో 31 శాతం వృద్ధి సాధించింది. ప్రత్యర్థి క్రెడ్‌ని అధిగమించి ఫోన్‌ పే, గూగుల్ పే మరియు పేటీఎంల తర్వాత దేశంలో నాల్గవ అతిపెద్ద UPI యాప్‌గా అవతరించింది. ఏకంగా 158 మిలియన్ల లావాదేవీలను నమోదు చేసింది. కాగా ముందు నెల సెప్టెంబర్‌లో ఈ సంఖ్య 120 మిలియన్లుగా ఉంది.

Navi gave big shock to opponent Cred in terms of UPI transactions

దేశవ్యాప్తంగా UPIని అమలు చేసే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) వద్ద అందుబాటులో ఉన్న డేటా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తోంది. యాప్ అందించే ప్రోత్సాహకాలు, క్యాష్‌బ్యాక్‌లు మునుపటి నెలల కంటే తగ్గినప్పటికీ వృద్ధిలో వేగం ఏమాత్రం తగ్గలేదు. ఇదే సమయంలో క్రెడ్ లావాదేవీలు సెప్టెంబర్‌లో 140 మిలియన్ల నుంచి అక్టోబర్‌లో 152 మిలియన్లకు పెరిగాయి. ఇక ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ UPI సర్వీస్ అయిన సూపర్ మనీ అక్టోబర్‌లో తన లావాదేవీల సంఖ్యను 50 మిలియన్లకు రెట్టింపు చేసింది.

నవీ మరియు క్రెడ్ రెండూ కలిసి UPI చెల్లింపుల్లో దాదాపు 1 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి. 48 శాతం వాటాతో ఫోన్‌ పే మార్కెట్ లీడర్‌గా కొనసాగుతోంది. గూగుల్ పే 37 శాతం మరియు పేటీఎం 7 శాతంతో తదనంతర స్థానాల్లో ఉన్నాయి. సూపర్ మనీ వాటా కేవలం 0.3 శాతానికి పరిమితమైంది. అయితే ఒక నెలలో మూడు రెట్లు వృద్ధి కనబరచడం గమనార్హం.

అక్టోబర్‌ పండుగ సీజన్ కావడం UPI లావాదేవీల వృద్ధికి ఎంతగానో దోహదపడింది. అక్టోబర్ 21 నుంచి రుణాలను నిలిపివేయాలని నవీ ఫిన్‌సర్వ్ కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ ఈ పరిమితులు UPI ట్రాన్సాక్షన్స్‌పై ఎటువంటి ప్రభావం చూపలేదు. ఇదే సమయంలో NPCI కూడా తన BHIM యాప్‌ ను ప్రత్యేక కంపెనీగా రూపొందించింది. తద్వారా మార్కెట్ లో దూకుడుగా వాటాను పెంచుకోవాలని చూస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+