2032, డిసెంబర్ 22: ఎవరు ఉంటారో ఎవరు పోతారో..: నాసా తాజా స్టేట్‌మెంట్‌లో

Asteroid hitting Earth: అంతరిక్షంలో గతి తప్పిన ఓ గ్రహశకలం భూమండలాన్ని వణికిస్తోంది. భయాందోళనలకు గురి చేస్తోంది. విశ్వాంతరాల్లో గ్రహ శకలాలు, ఉల్కాపాతాలు సర్వసాధారణమే. అవి దారి తప్పి దిశా తెన్నూ లేకుండా తిరుగాడుతుంటాయి. గతంలో అనేక అస్టరాయిడ్స్ భూమికి అత్యంత సమీపంలో దూసుకెళ్లిన సందర్భాలూ ఎన్నో ఉన్నాయి.

వీటన్నింటికీ భిన్నంగా..

వీటన్నింటికీ భిన్నంగా తాజాగా ఓ గ్రహ శకలం మాత్రం ఆందోళనకు గురి చేస్తోంది. ఇది- భూమిని ఢీ కొట్టడానికి అవకాశాలు చాలావరకు ఉన్నాయంటూ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తేల్చి చెప్పింది. ఇదివరకు వేసిన అంచనాల శాతాన్నీ పెంచుకుంటూ పోతోంది. ఇది అల్లాటప్పా అస్టరాయిడ్ కాదని తేల్చేసింది నాసా.

Now a 3 1 chance an asteroid will hit Earth in 2032 says NASA

అస్టరాయిడ్‌ కదలికలపై స్టేట్‌మెంట్..

తాజాగా ఈ అస్టరాయిడ్‌ సంచారంపై మరో స్టేట్‌మెంట్ విడుదల చేసింది. దీన్ని బట్టి చూస్తే- 2032లో భూమిని ఢీ కొట్టడానికి 3.1 శాతం అవకాశాలు ఉన్నాయి. ఇదివరకు నాసా వెలువడించిన అంచనాల శాతం 2.6 మాత్రమే. ఇప్పుడు ఏకంగా 3.1గా నిర్ధారించడం ప్రాధాన్యతను సంతరంచుకుంది. ఆ గ్రహ శకలం కదలికల ఆధారంగా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు సైతం లేకపోలేదు.

దాదాపుగా 54 మీటర్లు..

దీని పేరు అస్టరాయిడ్ 2024 వైఆర్ 4 (Asteroid 2024 YR4). దీని విస్తీర్ణం 177 అడుగులు. దాదాపుగా 54 మీటర్లు ఉంటుంది. ఓ అపార్ట్‌మెంట్ ఎత్తును పరిమాణంగా తీసుకోవచ్చు. అంత భారీగా గ్రహ శకలం కావడం వల్లే దీనికి సిటీ కిల్లర్ అని పేరు పెట్టింది నాసా. పొరపాటున ఏ నగరం మీద పడ్డా.. దాని నామరూపాలు ఈ భూగోళంపై నుంచి మటుమాయం కావడం ఖాయమని తేల్చింది.

2032 డిసెంబర్ 22వ తేదీ..

2032 డిసెంబర్ 22వ తేదీన ఈ వైఆర్ 4 అస్టరాయిడ్ భూమిని ఢీ కొడుతుందని స్పష్టం చేసింది నాసా. సాధారణంగా నాసా వేసిన అంచనాలేవీ తప్పవు. దాదాపుగా 100 శాతం ఖచ్చితత్వంతో కూడుకుని ఉంటాయి. ఈ పరిస్థితుల్లో వైఆర్ 4 ఎలాంటి ఉత్పాతాన్ని సృష్టిస్తుందనే ఉత్కంఠత నెలకొంది.

ముంబై, కోల్‌కత సహా..

ఈ గ్రహ శకలం ఢీ కొట్టడానికి గల అత్యధిక అవకాశాలు ఉన్న నగరాల్లో ముంబై, కోల్‌కత ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బొగొటా, అబిద్జాన్, లాగోస్, ఖార్టౌమ్, ఢాకా సైతం ఈ జాబితాలో ఉన్నాయి. భూ కక్ష్యకు సుదూరంగా ఈ గ్రహ శకలం ప్రయాణించడానికి ఇంకా 96.9 శాతం అవకాశం ఉందనే వాదనలు సైతం లేకపోలేదు. అయినప్పటికీ- భూమిని ఢీకొట్టడానికి గల అంచనాల శాతాన్నీ నాసా పెంచుకుంటూ పోతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+