Daughter of India: తెర మీదికి వచ్చిన మోదీ- లేఖ

Sunita Williams: దాదాపుగా భూమికి సుదూరంగా తొమ్మిది నెలల పాటు గడిపిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్‌కు విముక్తి లభించింది. తోటి వ్యోమగామి బ్యారీ బుచ్ విల్మోర్‌‌తో కలిసి భూమండలానికి తిరుగు ప్రయాణం కట్టారు. గత ఏడాది జూన్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి అక్కడే చిక్కుకుపోయిన వాళ్లిద్దరూ భూమ్మీదికి తిరిగి రాబోతోన్నారు. సునీత, బ్యారీ విల్మోర్ రాక కోసం ప్రపంచం మొత్తం ఉత్కంఠతగా ఎదురు చూస్తోంది. సేఫ్ ల్యాండింగ్ కావాలంటూ ఆకాంక్షిస్తోంది.

క్రూ-10 టీమ్..

వారిని భూమ్మీదికి తీసుకుని రావడానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్‌కు చెందిన డ్రాగన్ క్యాప్సుల్ క్రూ- 10ను పంపించింది. ఈ నెల 16వ తేదీ నాడే అది ఐఎస్ఎస్‌కు చేరుకుంది. నాసాకు చెందిన అన్నే మెక్‌క్లెయిన్, నికోల్ అయర్స్, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీకి చెందిన టకుయా ఒనిషి, రోస్కోస్మోస్ కాస్మోనాట్ కిరిల్ పెస్కోవ్‌లతో కూడిన క్రూ-10 టీమ్ అక్కడ అడుగు పెట్టింది.

ప్రధాని మోదీ లేఖ..

ఈ పరిస్థితుల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెరమీదికి వచ్చారు. సునీత విలియమ్స్‌కు లేఖ రాశారు. ఆమెను డాటర్ ఆఫ్ ఇండియాగా అభివర్ణించారు. సురక్షితంగా భూమి మీదికి చేరుకోవాలని ఆకాంక్షించారు. క్షేమంగా భూమి మీదికి తిరిగి రాక కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోందని పేర్కొన్నారు.

PM Modi

ఈ లేఖను పోస్ట్ చేసిన కేంద్రమంత్రి..

ఈ లేఖను కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. యావత్ దేశం తరఫున శుభాకాంక్షలను తెలియజేస్తోన్నానని మోదీ ఈ లేఖలో పేర్కొన్నారు. ఆస్ట్రోనాట్ మైక్ మస్సిమినోతో మాట్లాడానని, ఆ సమయంలో సునీత విలియమ్స్ గురించి ప్రస్తావించానని చెప్పారు.

ట్రంప్, బైడెన్ వద్దా..

ఇదివరకు అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వద్ద కూడా సునీత విలియమ్స్ రాక గురించి ఆరా తీశానని మోదీ గుర్తు చేశారు. ఇప్పుడు ఐఎస్ఎస్ నుంచి భూమ్మీదికి తిరిగి వస్తోన్న నేపథ్యంలో ఈ లేఖ రాయకుండా ఉండలేకపోతున్నానని పేర్కొన్నారు.

140 కోట్ల మంది..

సునీత విలియమ్స్ సాధించిన విజయాలు, అఛీవ్‌మెంట్లు.. 140 కోట్ల మంది భారతీయులను ఎంతగానో స్ఫూర్తినిచ్చాయని మోదీ అన్నారు. సునీత విలియమ్స్ తల్లిదండ్రులు బోనీ పాండ్యా, దివంగత దీపక్ భాయ్ ఆశీస్సులు ఆమె వెంట ఎప్పుడూ ఉంటాయని చెప్పారు. భూమ్మీదికి చేరిన తరువాత భారత పర్యటనకు రావాలని మోదీ కోరారు.

Sunita Williams

తొమ్మిది నెలలుగా..

గత ఏడాది జూన్‌లో సునీతా విలియమ్స్‌ బ్యారీ బుచ్ విల్మోర్‌ను ఐఎస్ఎస్‌‌కు పంపించింది నాసా. నిజానికి- అది 10 రోజుల ఆపరేషన్ మాత్రమే. ఐఎస్ఎస్‌లో అక్కడ తలెత్తిన కొన్ని సాంకేతికపరమైన ఇబ్బందులను సరిచేయడానికి వారిద్దరినీ స్టార్‌లైనర్ స్పేస్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో అంతరిక్ష కేంద్రానికి పంపింది. తిరిగి రావడం మాత్రం సాధ్యపడట్లేదు.

స్టార్‌లైనర్ రిపేర్లు..

స్టార్‌లైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రొపల్షన్ సిస్టమ్‌లో థ్రస్టర్లు పనిచేయకపోవడం, హీలియం లీక్ కావడం సహా అనేక సాంకేతిక సమస్యల కారణంగా వారిద్దరూ అక్కడే చిక్కుకుపోవాల్సివచ్చింది. అదే ఏడాది జూన్ 13వ తేదీన బోయింగ్ స్టార్‌లైనర్‌లో సమస్యలు తలెత్తాయి. సర్వీస్ మాడ్యూల్‌లో హీలియం లీక్‌తో పాటు 28 థ్రస్టర్లల్లో అయిదు పూర్తిగా పని చేయడం మానేశాయి.

ఐఎస్ఎస్‌కు..

ఇప్పుడు తాజాగా అది కార్యరూపం దాల్చింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారు జామున 4: 33 నిమిషాలకు ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్‌లో ఈ డ్రాగన్ క్రూ క్యాప్సుల్ 10 స్పేస్ క్రాఫ్ట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ఉదయం 10 గంటల సమయంలో ఐఎస్ఎస్‌కు చేరుకుంది.

హోమ్ కమింగ్..

ఇదే స్పేస్ క్రాఫ్ట్‌లో సునీత విలియమ్స్, బ్యారీ విల్మోర్ భూమ్మీదికి తిరిగి వస్తోన్నారు. కొద్దిసేపటి కిందటే ఈ స్పేస్ క్రాఫ్ట్ ఐఎస్ఎస్ నుంచి న్ డాక్ అయింది. 17 గంటల పాటు వాళ్లు స్పేస్‌లో ట్రావెల్ చేస్తారు. వారిని తీసుకొస్తోన్న స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్రూ స్పేస్ క్రాఫ్ట్.. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారు జామున సరిగ్గా 3: 27 నిమిషాలకు ఫ్లోరిడా తీరంలో ల్యాండ్ అవుతుంది.

మెడికల్ టెస్టులు..

ఆ వెంటనే వ్యోమగాములిద్దిరినీ టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో నాసాకు చెందిన జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తీసుకెళ్తారు. సమగ్ర వైద్య పరీక్షలను నిర్వహిస్తారు. తొమ్మిది నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో గడిపినందున భూమి గ్రావిటీకి వాళ్ల శరీరం అలవాటుపడేంత వరకూ మెడికల్ ఎవాల్యూషన్‌లో ఉంచుతారు. ఫిజికల్, మెంటల్ ఫిట్‌నెస్ టెస్టులను నిర్వహిస్తారు.

నాసా లైవ్..

ఈ ప్రక్రియ మొత్తాన్ని కూడా నాసా ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. నాసా టెలివిజన్, యూట్యూబ్‌లల్లో దీన్ని చూడొచ్చు. అన్ డాక్ మొదలుకావడానికి రెండు గంటల ముందు నుంచీ ల్యాండ్ అయ్యేంత వరకూ లైవ్ స్ట్రీమింగ్ కొనసాగుతుందని నాసా వెల్లడించింది. క్యాప్సుల్ ల్యాండ్ అయినప్పటి నుంచి సునీత విలియమ్స్, బ్యారీ విల్మోర్‌ను స్పేస్ సెంటర్‌కు తరలించేంత వరకు లైవ్ ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+