నేడే సౌర తుఫాను! మరికాసేపట్లో భూమిని ఢీ..పెను విస్ఫోటనం

సూర్యుడి నుంచి దూసుకొస్తున్న శక్తివంతమైన సౌర విస్ఫోటనాలు నేడు భూమిని తాకనున్నాయి. సూర్యుడి ఉపరితలంపై జరిగిన రెండు భారీ విస్ఫోటనాల కారణంగా అంతరిక్షంలో చార్జ్ అయిన రేడియేషన్ మేఘాలు వేగంగా పుడమి వైపు పయనిస్తున్నాయి. ఈ పరిణామం వల్ల భూమి వాతావరణం, అయస్కాంత క్షేత్రంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

అమెరికాకు చెందిన నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్పిరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) దీనిపై స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది. అయితే ఈ తుఫాను ప్రభావం ఏ స్థాయిలో ఉండనుందనేది ఆ సౌర కణాలు భూమి అయస్కాంత క్షేత్రాన్ని తాకే విధానంపైనే ఆధారపడి ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Powerful Solar Storm Expected to Hit Earth Today NOAA Issues G2 Geomagnetic Storm Watch Alert

సౌర తుఫాను అంటే ఏమిటి? దాని స్థాయిలు ఎలా ఉంటాయి?

సూర్యుడిపై జరిగే అసాధారణ పరిణామాల వల్ల భారీగా శక్తి, చార్జ్ అయిన కణాలు అంతరిక్షంలోకి విడుదలవుతాయి. దీన్నే 'సౌర తుఫాను' అంటారు. సూర్యుడి నుంచి వెలువడే భారీ అయస్కాంత కణాలు, ప్లాస్మా మేఘాలను 'కరోనల్ మాస్ ఎజెక్షన్' (CME) అని పిలుస్తారు. ఇవి భూమిని చేరుకున్నప్పుడు మన గ్రహం సహజమైన అయస్కాంత క్షేత్రాన్ని అస్తవ్యస్తం చేస్తాయి. ఈ జియోమ్యాగ్నెటిక్ తుఫాను తీవ్రతను NOAA సంస్థ G1 (చిన్నది) నుంచి అత్యంత ప్రమాదకరమైన G5 స్థాయి వరకు ఐదు శ్రేణులుగా వర్గీకరించింది. నంబర్ ఎంత ఎక్కువగా ఉంటే అంతటి తీవ్రమైన ప్రభావం ఏర్పడే అవకాశం ఉంటుంది.

సౌర తుఫాను ధాటికి స్తంభించిన రైల్వే వ్యవస్థ.. 16 నిమిషాల ఆలస్యంగా ట్రైన్స్
సౌర తుఫాను ధాటికి స్తంభించిన రైల్వే వ్యవస్థ.. 16 నిమిషాల ఆలస్యంగా ట్రైన్స్

నేడు ఏం జరగనుంది? రెండు విస్ఫోటనాల కలయిక

అక్టోబర్ 7, 8 తేదీల్లో సూర్యుడి నుంచి వెలువడిన రెండు వేర్వేరు సౌర విస్ఫోటనాలు ఒకదానితో ఒకటి కలిసి భూమి వైపు దూసుకొస్తున్నాయని NOAA స్పేస్ వెదర్ ప్రిడిక్షన్ సెంటర్ వెల్లడించింది. రెండవ విస్ఫోటనం చాలా వేగంగా కదులుతుండటంతో, అది మొదటిదానితో కలిసి మరింత శక్తివంతంగా భూమిని తాకనుంది. దీనివల్ల మధ్యస్థ స్థాయి (G2) జియోమ్యాగ్నెటిక్ తుఫాను ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే తుఫాను తీవ్రత భూమి వాతావరణాన్ని తాకిన తర్వాతే కచ్చితంగా అంచనా వేయగలమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

శాటిలైట్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్‌పై ప్రభావం

G2 స్థాయి తుఫానుల వల్ల భూమిపై ధ్రువ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న దేశాల్లో పవర్ గ్రిడ్లలో వోల్టేజ్ మార్పులు వచ్చే అవకాశం ఉంది. అలాగే శాటిలైట్ ఆపరేటర్లు కొన్ని సర్దుబాట్లు చేసుకోవాల్సి వస్తుంది. రేడియో సిగ్నల్స్ బలహీనపడటం, జీపీఎస్ వంటి శాటిలైట్ నావిగేషన్ సేవల్లో స్వల్ప అంతరాయాలు ఏర్పడే ఛాన్స్ ఉంది. సాధారణంగా ఈ సౌర కణాలు భూమి వాతావరణంలోని వాయువులతో సంకర్షణ చెందడం వల్ల ఆకాశంలో అద్భుతమైన రంగుల వెలుగులు (అరోరాస్) కనిపిస్తుంటాయి. అయితే ఈసారి ఆ అద్భుతాలు సాధారణ ప్రాంతాల కంటే కొంచెం దూరంగా కనిపించవచ్చు.

కాసేపట్లో భూమిని తాకనున్న సౌర తుఫాను.. 11 ఏళ్ల సౌర చక్రంలో కొత్త అలజడి..
కాసేపట్లో భూమిని తాకనున్న సౌర తుఫాను.. 11 ఏళ్ల సౌర చక్రంలో కొత్త అలజడి..

భారత్‌పై దీని ప్రభావం ఎలా ఉండనుంది?

భారతదేశం విషయానికి వస్తే, ఈ G2 స్థాయి సౌర తుఫాను వల్ల రోజువారీ జనజీవనానికి ఎలాంటి ముప్పు లేదని నిపుణులు భరోసా ఇస్తున్నారు. దేశంలో కరెంట్ కోతలు రావడం కానీ, కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిపోవడం కానీ జరగదు.

అలాగే మన దేశంలో ఆకాశంలో వింత వెలుగులు (అరోరాస్) కనిపించే అవకాశం కూడా లేదు. ఇది కేవలం ఒక ముందస్తు అంచనా మాత్రమేనని, సౌర కణాలు భూమి వాతావరణాన్ని సమీపించే కొద్దీ పరిస్థితుల్లో మార్పులు ఉండవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+