షాకింగ్ ఆఫర్: ఒక్క రూపాయికే ఐఫోన్!
ఒక్క రూపాయికే ఐఫోన్ వస్తుందంటే నమ్ముతారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కేవలం ఒక్క రూపాయి నాణేన్ని ఇస్తే రూ.80 వేల విలువైన కొత్త ఐఫోన్‌ను ఉచితంగా ఇస్తానని ఓ దుకాణదారుడు ఆఫర్ ఇస్తున్నాడు. అయితే దీని వెనుక ఓ ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది.
ఏమిటా ట్విస్ట్?
వైరల్ వీడియోలోని దుకాణదారుడు ఐఫోన్ ఇవ్వడానికి ఒకే ఒక కండిషన్ పెట్టాడు. మీ దగ్గర ఉన్న రూపాయి నాణెం 1970వ సంవత్సరానికి చెందినదై ఉండాలి. ఆ సంవత్సరం ముద్రించిన నాణేన్ని ఇస్తే ఎటువంటి ఈఎంఐలు లేకుండా ఐఫోన్‌ను సొంతం చేసుకోవచ్చని ఆయన చెబుతున్నాడు

1970 రూపాయి నాణేనికి ఎందుకంత డిమాండ్?
రూపాయి నాణేనికి ఐఫోన్ ఇవ్వడం వినడానికి వింతగా ఉన్నా, ఈ నాణేల వెనుక పెద్ద చరిత్రే ఉంది. 1970 సమయంలో ప్రపంచవ్యాప్తంగా నికెల్ ) ధాతువుకు తీవ్ర కొరత ఏర్పడింది. అప్పట్లో రూపాయి నాణేలను 100 శాతం నికెల్‌తో తయారు చేసేవారు. నికెల్ ధరలు ఆకాశాన్నంటడంతో 1970లో భారత ప్రభుత్వం కేవలం 2,900 నాణేలను మాత్రమే ముద్రించింది. ఆ తర్వాత 1971 నుండి 1974 వరకు రూపాయి నాణేల ముద్రణను నిలిపివేసి, నికెల్‌కు బదులుగా రాగి-నికెల్ మిశ్రమాన్ని వాడటం ప్రారంభించింది. 100 శాతం నికెల్‌తో తయారైన ఈ 1970 నాణేలు ఇప్పుడు చాలా అరుదుగా దొరుకుతున్నాయి. అందుకే కాయిన్ కలెక్టర్లు వీటి కోసం లక్షలు వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నారు.
ఎంత ధరకు అమ్ముడవుతోంది?
ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్ అయిన Ebay, ఇతర పాత నాణేలను విక్రయించే ప్లాట్‌ఫారమ్‌లలో ఈ నాణేనికి భారీ ధర పలుకుతోంది. కొన్ని వెబ్‌సైట్లలో దీని ధర రూ. 20 వేల నుండి రూ. 1 లక్ష వరకు ఉంది. ఒక అంతర్జాతీయ వెబ్‌సైట్‌లో దీని విలువ 1150 డాలర్లు (అంటే సుమారు రూ. 95 వేలకు పైగా) ఉంది. అందుకే ఆ దుకాణదారుడు రూ. 80 వేల ఐఫోన్ ఇచ్చినా తనకు లాభమే అని భావిస్తున్నాడు.
-
ఇంటర్నెట్ లేకుండానే "ఇన్స్టాగ్రామ్" రీల్స్ చూడడం ఎలాగంటే..? -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications