డొనాల్డ్ ట్రంప్ సమక్షంలో.. బిగ్గెస్ట్ స్పేస్ టెస్ట్ ఫ్లైట్: అదొక్కటే మైనస్
Elon Musk: అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ.. అంతరిక్షంపై తన జైత్రయాత్రను కొనసాగిస్తూ వస్తోంది. మరో విజయకేతనం ఎగురవేసింది. నిన్నటికి నిన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు చెందిన 4,200 కేజీల బరువు ఉన్న జీశాట్ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టింది స్పేస్ ఎక్స్.
ఇప్పుడు తాజాగా మరో భారీ రాకెట్ ప్రయోగాన్ని విజయవంతం చేసింది. ఇది ఆరో టెస్ట్ ఫ్లైట్. ఈ ప్రయోగం విజయవంతమైనట్లు స్పేస్ ఎక్స్ ప్రకటించింది. ఈ ప్రయోగాన్ని అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యక్షంగా వీక్షించడం హైలైట్‌గా చెప్పుకోవచ్చు. దీనికోసం ఆయన స్వయంగా స్టార్‌షిప్ రాకెట్ లాంగ్ కేంద్రానికి వెళ్లారు.

భారత కాలమానం ప్రకారం ఈ తెల్లవారు జామున 3:30 గంటలకు అమెరికాలోని టెక్సాస్‌లో గల బొకచిక నుంచి నింగిలోకి దూసుకెళ్లాంది స్టార్‌షిప్ రాకెట్. 400 అడుగులు అంటే సుమారుగా 122 మీటర్ల ఎత్తు గల రాకెట్ ఇది. చంద్రుడితో పాటు మార్స్‌పై మనుషులను పంపించడానికి ఉద్దేశించిన మిషన్‌లో భాగంగా స్పేస్ ఎక్స్ ఈ ఫ్లైట్ టెస్ట్ నిర్వహించింది.
62 కిలోమీటర్ల ఎత్త వరకు దూసుకెళ్లిన తరువాత తొలి దఫా సూపర్ హెవీ బూస్టర్.. రాకెట్ నుంచి విడివడింది. దీనితో ఈ ప్రయోగం విజయవంతమైనట్లు ప్రకటించింది స్పేస్ ఎక్స్. ఆ తరువాత భూమికి అంటే గ్రౌండ్ స్టేషన్‌కు తిరిగి వచ్చే క్రమంలో ఈ బూస్టర్ అదుపు తప్పింది.
ప్రయోగించిన ప్రదేశానికే చేరుకోవడానికి బదులుగా బూస్టర్ గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో, రాకెట్ విడిభాగాలు హిందూ మహాసముద్రంలో కూప్పకూలాయి. ఈ ఫ్లైట్ టెస్ట్‌లో కనిపించిన లోపం ఇదొక్కటే. నిర్దేశిత ప్రదేశానికి చేరుకోవడానికి బదులుగా సముద్రంలో కుప్పకూలడంపై గల కారణాలను అన్వేషిస్తోన్నట్లు స్పేస్ ఎక్స్ తెలిపింది.
ఈ ప్రయోగాన్ని వీక్షించడానికి ఎలాన్ మస్క్‌తో కలిసి డొనాల్డ్ ట్రంప్ బొకచిక లాంచింగ్ కేంద్రానికి చేరుకోవడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఎలాన్ మస్క్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని ఆయన మరోసారి నిరూపించుకున్నట్టయింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు చాలాకాలం నుంచే ట్రంప్‌కు మద్దతుగా ఉంటూ వచ్చారు మస్క్. ఎక్స్‌పై ఇంటర్వ్యూ సైతం నిర్వహించారు.
-
ఇరాన్ వార్ ఆపేద్దాం సార్..? ట్రంప్ కు సలహాదారుల షాక్.! -
US-Iran War: క్లైమాక్స్ కు యుద్ధం.. ఇక తాడో పేడో..!! -
యుద్ధం ముగుస్తుందా? ఇరాన్‌పై ట్రంప్ సంచలన ప్రకటన! -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!!












Click it and Unblock the Notifications