విడిపోయిన స్పేస్ క్యాప్సుల్: మరో కల్పన చావ్లా కాకూడదంటూ..

Sunita Williams: తొమ్మిది నెలల కిందట అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి అక్కడే చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్‌కు విముక్తి లభించింది. తోటి వ్యోమగామి బ్యారీ బుచ్ విల్మోర్‌‌తో కలిసి భూమండలానికి తిరుగు ప్రయాణం కట్టారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

16వ తేదీ నాడే..

వారిని భూమ్మీదికి తీసుకుని రావడానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్‌కు చెందిన డ్రాగన్ క్యాప్సుల్ క్రూ- 10ను పంపించింది. ఈ నెల 16వ తేదీ నాడే అది ఐఎస్ఎస్‌కు చేరుకుంది. నాసాకు చెందిన అన్నే మెక్‌క్లెయిన్, నికోల్ అయర్స్, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీకి చెందిన టకుయా ఒనిషి, రోస్కోస్మోస్ కాస్మోనాట్ కిరిల్ పెస్కోవ్‌లతో కూడిన క్రూ-10 టీమ్ అక్కడ అడుగు పెట్టింది.

SpaceX

గత ఏడాది జూన్‌లో..

గత ఏడాది జూన్‌లో సునీతా విలియమ్స్‌ బ్యారీ బుచ్ విల్మోర్‌ను ఐఎస్ఎస్‌‌కు పంపించింది నాసా. నిజానికి- అది 10 రోజుల ఆపరేషన్ మాత్రమే. ఐఎస్ఎస్‌లో అక్కడ తలెత్తిన కొన్ని సాంకేతికపరమైన ఇబ్బందులను సరిచేయడానికి వారిద్దరినీ స్టార్‌లైనర్ స్పేస్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో అంతరిక్ష కేంద్రానికి పంపింది. తిరిగి రావడం మాత్రం సాధ్యపడట్లేదు.

హీలియం లీక్..

స్టార్‌లైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రొపల్షన్ సిస్టమ్‌లో థ్రస్టర్లు పనిచేయకపోవడం, హీలియం లీక్ కావడం సహా అనేక సాంకేతిక సమస్యల కారణంగా వారిద్దరూ అక్కడే చిక్కుకుపోవాల్సివచ్చింది. అదే ఏడాది జూన్ 13వ తేదీన బోయింగ్ స్టార్‌లైనర్‌లో సమస్యలు తలెత్తాయి. సర్వీస్ మాడ్యూల్‌లో హీలియం లీక్‌తో పాటు 28 థ్రస్టర్లల్లో అయిదు పూర్తిగా పని చేయడం మానేశాయి.

స్పేస్‌ ఎక్స్‌..

ఫలితంగా- ఐఎస్ఎస్‌లో చిక్కుకుపోయిన సునీత విలయమ్స్, విల్మోర్‌ను భూమ్మీదికి తీసుకుని రావడానికి స్పేస్‌ ఎక్స్‌ సహాయాన్ని తీసుకుంది.క్రూ డ్రాగన్‌‌ క్యాప్సుల్‌లో వారిని భూమికి తిరిగి తీసుకొస్తామంటూ అప్పట్లోనే నాసా వెల్లడించింది.

ఐఎస్ఎస్‌కు..

ఇప్పుడు తాజాగా అది కార్యరూపం దాల్చింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారు జామున 4: 33 నిమిషాలకు ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్‌లో ఈ డ్రాగన్ క్రూ క్యాప్సుల్ 10 స్పేస్ క్రాఫ్ట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ఉదయం 10 గంటల సమయంలో ఐఎస్ఎస్‌కు చేరుకుంది.

హోమ్ కమింగ్..

ఇదే స్పేస్ క్రాఫ్ట్‌లో సునీత విలియమ్స్, బ్యారీ విల్మోర్ భూమ్మీదికి తిరిగి వస్తోన్నారు. కొద్దిసేపటి కిందటే ఈ స్పేస్ క్రాఫ్ట్ ఐఎస్ఎస్ నుంచి న్ డాక్ అయింది. 17 గంటల పాటు వాళ్లు స్పేస్‌లో ట్రావెల్ చేస్తారు. వారిని తీసుకొస్తోన్న స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్రూ స్పేస్ క్రాఫ్ట్.. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారు జామున సరిగ్గా 3: 27 నిమిషాలకు ఫ్లోరిడా తీరంలో ల్యాండ్ అవుతుంది.

మెడికల్ ఎవాల్యూషన్స్..

ఆ వెంటనే వ్యోమగాములిద్దిరినీ టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో నాసాకు చెందిన జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తీసుకెళ్తారు. సమగ్ర వైద్య పరీక్షలను నిర్వహిస్తారు. తొమ్మిది నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో గడిపినందున భూమి గ్రావిటీకి వాళ్ల శరీరం అలవాటుపడేంత వరకూ మెడికల్ ఎవాల్యూషన్‌లో ఉంచుతారు.

నాసా లైవ్..

ఈ ప్రక్రియ మొత్తాన్ని కూడా నాసా ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. నాసా టెలివిజన్, యూట్యూబ్‌లల్లో దీన్ని చూడొచ్చు. అన్ డాక్ మొదలుకావడానికి రెండు గంటల ముందు నుంచీ ల్యాండ్ అయ్యేంత వరకూ లైవ్ స్ట్రీమింగ్ కొనసాగుతుందని నాసా వెల్లడించింది.

కల్పన చావ్లా కాకూడదంటూ..

ఈ 17 గంటల ప్రయాణం ఉత్కంఠంగా మారింది. గతంలో ఐఎస్ఎస్ నుంచి తిరిగి వస్తోన్న సమయంలో భారత సంతతికే చెందిన కల్పన చావ్లా కన్నుమూసిన విషయం తెలిసిందే. స్పేస్ క్రాఫ్ట్‌లో సాంకేతక సమస్యలు తలెత్తడంతో భూకక్ష్యలోకి అది ప్రవేశించిన వెంటనే కాలిపోయింది. ఆమెతో పాటు తోటి వ్యొమగాములూ మరణించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+