Video: గాల్లో ఎగిరే టెస్లా సూపర్ కారు.. ప్రపంచాన్ని షేక్ చేసిన ఎలాన్ మస్క్!
సినిమాల్లో మాత్రమే కార్లు ఎగరడం, తలక్రిందులుగా దూసుకుపోవడం మనం చూస్తుంటాం. కానీ, సరిగ్గా అలాంటి అద్భుతాన్నే ప్రపంచానికి పరిచయం చేసింది ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా. టెక్సాస్‌లోని స్పేస్ఎక్స్ కేంద్రంలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో కొత్తగా డిజైన్ చేసిన టెస్లా రోడ్‌స్టర్ కారు గాల్లో ఎగురుతూ, రాంప్ పై తలక్రిందులుగా ప్రయాణించి అందరినీ ఖంగుతినిపించింది. దాదాపు తొమ్మిది సంవత్సరాల క్రితం ఈ నెక్స్ట్-జెన్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్ భావనను ప్రకటించిన మస్క్, ఇప్పుడు దాన్ని అద్భుతమైన ప్రదర్శన ద్వారా ఆచరణలో చూపించి సంచలనం సృష్టించారు.
స్పేస్ఎక్స్ రాకెట్ టెక్నాలజీతో కార్..
ఈ సరికొత్త రోడ్‌స్టర్ కారు కేవలం సాధారణ రోడ్డుపై నడవడమే కాకుండా, ప్రత్యేకమైన విన్యాసాలు చేయగలగడానికి కారణం స్పేస్ఎక్స్ టెక్నాలజీ. ఎలాన్ మస్క్ రాకెట్ సంస్థ అయిన స్పేస్ఎక్స్ సహకారంతో అభివృద్ధి చేసిన కోల్డ్-గ్యాస్ థ్రస్టర్లను ఈ కారులో అమర్చారు. ప్రెషర్ గ్యాస్ ద్వారా శక్తిని ఉత్పత్తి చేసే ఈ అత్యాధునిక వ్యవస్థ కారణంగా.. సాధారణ కార్లయతే అస్సలు చేయలేని విన్సెంట్‌లను ఈ రోడ్‌స్టర్ సులభంగా చేసి చూపించింది. కారు ఒక భారీ వక్ర రాంప్ పైకి ఎక్కి, తలక్రిందులుగా ప్రయాణించి, ఆపై కొద్దిసేపు గాల్లో తేలి సురక్షితంగా భూమిపై దిగడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

Do a kickflip! https://t.co/DJ1Bq1yu8m
— Tesla (@Tesla) October 16, 2026
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో.. మస్క్ క్యాప్షన్ అదుర్స్
ఈ అద్భుతమైన ప్రదర్శనకు సంబంధించిన వీడియోను ఎలాన్ మస్క్ తన అధికారిక ఎక్స్ వేదికగా షేర్ చేశారు. "ఎట్టకేలకు భవిష్యత్తులో నిజంగానే ఫ్లయింగ్ కార్లు వస్తున్నాయి" అంటూ ఆయన పెట్టిన క్యాప్షన్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సైన్స్ ఫిక్షన్ సినిమాలు నిజమవుతున్నాయని ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ విన్సెంట్లు అన్నీ పూర్తిగా కంట్రోల్డ్ కండిషన్స్ మాత్రమే జరిగాయని, రోడ్లపై ఈ కారు గాల్లో ప్రయాణించడానికి చట్టపరమైన అనుమతులు ఇంకా రావాల్సి ఉందని నిపుణులు గుర్తు చేస్తున్నారు.
Real life, baby https://t.co/3QEqn18wig
— Tesla (@Tesla) October 16, 2026
2028లో ఉత్పత్తి ప్రారంభం?
తొలుత నవంబర్ 2017లో ఈ నెక్స్ట్-జెన్ రోడ్‌స్టర్‌ను ప్రకటించినప్పటికీ, వివిధ కారణాల వల్ల దీని ఉత్పత్తి పదే పదే ఆలస్యం అవుతూ వచ్చింది. దీంతో కారు కోసం బుకింగ్ చేసుకున్న కస్టమర్లు ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. తాజా ప్రదర్శన తర్వాత అందిన సమాచారం ప్రకారం, ఈ సరికొత్త రోడ్‌స్టర్ ఉత్పత్తిని 2028 నాటికి ప్రారంభించాలని టెస్లా ప్లాన్ చేస్తోంది. భవిష్యత్తు రవాణా వ్యవస్థ ఎలా ఉండబోతుందో ఈ కారు ఒక శాంపిల్ మాత్రమేనని, రోజువారీ రవాణాలో ఫ్లయింగ్ కార్లు వాస్తవ రూపం దాల్చడానికి ఇంకా కొంత సమయం పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.














Click it and Unblock the Notifications
