శబరిమల భక్తులకు టీడీబీ బిగ్ అప్డేట్- ఆ సౌకర్యాలు ఉచితం, గదుల కేటాయింపు ఇక ఇలా..!!
శబరిమల భక్తులకు కీలక అప్డేట్. ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. శబరిమల వర్చువల్ క్యూ రుసుము పెంపు ప్రతిపాదనలతో పాటు పంబ, సన్నిధానం మార్గాల్లో భక్తులకు ఉచిత సౌకర్యాలు కల్పించేందుకు సన్నాహాలు చేస్తోంది. సదుపాయాలు ఉచితంగా అందుబాటులోకి తేవాలని డిసైడ్ అయింది. అదే విధంగా గదుల బుకింగ్.. కేటాయింపు విధానం లోనూ సమూల మార్పులు చేస్తోంది. కొత్త విధానం అందుబాటులోకి తీసుకొస్తోంది.
శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం కోసం వచ్చే భక్తుల సౌకర్యార్థం ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భక్తులకు ఉచిత సౌకర్యాలు కల్పించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం వర్చువల్ క్యూ సేవలు పొందే సమయంలో పిలిగ్రిమ్ రిలీఫ్ ఫండ్ కింద వసూలు చేస్తున్న 5 రూపాయల విరాళాన్ని 10 రూపాయలకు పెంచాలని దేవస్వం బోర్డు భావిస్తోంది. ఈ సేవా రుసుము పెంపు ద్వారా వచ్చేదనంతో యాత్రికులకు మరిన్ని మెరుగైన వసతులు అందించనున్నారు. ఈ పెంపు అమల్లోకి రావాలంటే కేరళ హైకోర్టు అనుమతి తప్పనిసరి కావడం వల్ల దేవస్వం బోర్డు త్వరలోనే కోర్టును ఆశ్రయించనుంది. కోర్టు ఆమోదం లభిస్తే రాబోయే మండల మకరవిళక్కు తీర్థయాత్ర కాలం నుంచే ఈ కొత్త విరాళం నిబంధన అమల్లోకి వస్తుంది. అయితే భక్తులు ఈ విరాళం చెల్లించడం అనేది వారి వ్యక్తిగత ఇష్టమని, దీనిపై ఎలాంటి బలవంతం లేదని అధికారులు స్పష్టం చేశారు.

బోర్డు తాజా నిర్ణయాలు
కాగా, గతంలో శబరిమల యాత్ర మార్గంలో మరుగుదొడ్లు, స్నానాల గదుల వినియోగానికి భక్తులు డబ్బులు చెల్లించాల్సి వచ్చేది. ఇకపై శబరిమల సన్నిధానం, పంబ, స్వామి అయ్యప్పన్ రోడ్డు మొదలైన ప్రాంతాల్లోని శౌచాలయాలు, స్నానపు గదులను భక్తులు ఉచితంగా వినియోగించుకునే వెసులు బాటు కల్పించింది. సన్నిధానంలో గదుల బుకింగ్ ప్రక్రియలో పారదర్శకత పెంచేందుకు దేవస్వం బోర్డు కఠిన చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు కేవలం 190 గదులు మాత్రమే ఆన్లైన్ ద్వారా అందుబాటులో ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్యను 400 గదులకు పెంచారు. ప్రొటోకాల్ గెస్ట్ హౌస్గా ఉన్న శబరి గెస్ట్ హౌస్లో కూడా 10 గదులను ఆన్లైన్ బుకింగ్ పరిధిలోకి తీసుకు వచ్చారు. తులమాసం పూజల నుంచి ఈ కొత్త ఆన్లైన్ గదుల కేటాయింపు విధానం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. 100 శాతం పారదర్శకత సాధించడమే లక్ష్యంగా డిజిటల్ విధానాన్ని విస్తరిస్తున్నారు.













Click it and Unblock the Notifications
