తెలంగాణ మెడికల్ కాలేజీలకు కేంద్రం వరం.. ఏకంగా రూ.379 కోట్లు!

తెలంగాణా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరో వరం ప్రకటించింది. తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైద్య రంగానికి పెద్ద పీట వేస్తుంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ మెడికల్ కళాశాలల ఏర్పాటు జరిగింది. దీంతో రాష్ట్రంలో మెడికల్ సీట్లు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో కేంద్రం ప్రభుత్వ వైద్య కళాశాలలు, వాటి అనుబంధ ఆస్పత్రుల అభివృద్ధికి కావాల్సిన సాయం అందించనున్నట్టు వెల్లడించింది.

తెలంగాణలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, వాటి అనుబంధ ఆసుపత్రుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. గత రెండేళ్లలో 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 465 పీజీ సీట్లు పెరిగిన నేపథ్యంలో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద రూ.379.29 కోట్లు ఇచ్చేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని గురువారం రాష్ట్ర ఆరోగ్యశాఖ కార్యదర్శికి లేఖ ద్వారా తెలియజేశారు.

Central funds to medical colleges centre Sanctions 379 Crore for Telangana Medical Colleges After PG Seats Rise

ఒక్కో అదనపు పీజీ సీటుకు సగటున రూ.81.57 లక్షల చొప్పున కేంద్రం నిధులు అందించనుంది. రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా మరో రూ.253 కోట్లు జోడించి మొత్తం రూ.632 కోట్లతో కాలేజీలు, హాస్పిటళ్లలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచనుంది. ఈ నిధులు తరగతి గదులు, ల్యాబ్‌లు, హాస్పిటల్ వార్డులు, పరికరాలు వంటి అవసరాలకు ఉపయోగపడతాయి.

అదనంగా ఈ ఏడాది ఆదిలాబాద్ రిమ్స్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, సిద్ధిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కలిపి 110 ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయి. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) ఈ పెంపునకు అనుమతి ఇచ్చింది. ఈ నాలుగు కాలేజీలు, వాటి అనుబంధ ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగుపరిచేందుకు రూ.108 కోట్లతో పనులు చేపట్టనుండగా, అందులో రూ.64 కోట్లు కేంద్రం భరిస్తుంది.

మహిళలతో దాండియా ఆడిన రోబో.. పండుగల్లోనూ రోబోల జోరు!
మహిళలతో దాండియా ఆడిన రోబో.. పండుగల్లోనూ రోబోల జోరు!

రాష్ట్రంలో వైద్య విద్యకు మరింత బలం చేకూర్చే ఈ నిర్ణయం విద్యార్థులకు, రోగులకు ఒకేసారి ప్రయోజనం చేకూరుస్తుంది. పీజీ సీట్లు పెరగడం వల్ల నైపుణ్యం గల వైద్యుల సంఖ్య పెరుగుతుంది. అదే సమయంలో హాస్పిటళ్లలో సేవలు మెరుగవుతాయి. ప్రభుత్వం ఈ నిధులను సకాలంలో ఉపయోగించి మౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేయాలని ఆశిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+