పోర్చుగల్‌లో ఆకాశం నుంచి దూసుకొచ్చిన ఫైర్ బాల్‌.. వీడియో వైర‌ల్‌!

ఈ ఏడాది మార్చి 16 శనివారం ఉదయం 1:54 గంటలకు పోర్చుగల్ ఒక్క‌సారిగా ఉలిక్కిపడింది. ఆకాశం నుంచి చంద్రుని కంటే ప్రకాశవంతమైన‌ ఒక ఫైర్‌బాల్ అక్క‌డి నేల‌ను తాకింది. తాజాగా ఇందుకు సంబంధించిన లైవ్ వీడియో ఎక్స్‌లో వైర‌ల్‌గా మారింది. గంటకు 61 వేల కి.మీ వేగంతో భూ ఉప‌రిత‌ల‌ వాతావరణంలోకి ప్రవేశించిన ఉల్క వల్ల ఏర్పడిన ఈ ఫైర్‌బాల్‌ ఎవోరా జిల్లాలోని ఫోరోస్ డి వాలే ఫిగ్యురా ప్రాంతంలో 91 కిలోమీటర్ల ఎత్తులో గుర్తించబడిందని పరిశోధకులు వెళ్ల‌డించారు. అండలూసియన్ ఆస్ట్రోఫిజిక్స్ ఇన్స్టిట్యూట్ (IAA-CSIC), జోస్ మరియా మాడిడో స్మార్ట్ ప్రాజెక్ట్ ప‌రిశోధ‌కులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం..

ఈ శిల ఈశాన్య దిశగా కదిలి, సౌసెల్ మునిసిపాలిటీలోని కానో పారిష్ మీదుగా సుమారు 19 కిలోమీటర్ల ఎత్తులో విచ్ఛిన్నమైందని స్ప‌ష్టం చేశారు. అయితే, సాధార‌ణంగా ఉల్క బాహ్య అంతరిక్షంలో ఉద్భవించి, భూ ఉపరితలం చేరుకునే క్ర‌మంలో చిన్న చిన్న శకలాలుగా మారిపోతాయి. అవి ముక్కలగా వరకు వివిధ పరిమాణంలో ఉండవచ్చు. ఈ ప‌రిమాణం అనుకున్న‌దాని కంటే పెద్దగా ఉండ‌డంతో ఇక్క‌డ అనేక పేలుళ్లు జరిగాయని ప‌రిశోధ‌కులు తెలిపారు. అంతేకాదు, ప్రాథమిక విశ్లేషణలో ఉల్క పూర్తిగా ధ్వంసం కాలేదని, దానిలో కొంత భాగం భూమిపై పడిందని చెప్పుకొచ్చారు.

The fire ball that jumped from the sky in Portugal the video is viral

అంత‌రిక్ష శిల‌లే ఉల్క‌లు..

భూమి ఉపరితలంపై పడే అంతరిక్ష శిలలే ఉల్కలుగా చెబుతారు. అవి కామెట్, గ్రహశకలం లేదా ఉల్క వంటి వస్తువుల అవశేషాలు కూడా కావచ్చు. బాహ్య అంతరిక్షంలో ఉద్భవించి భూ ఉపరితలం చేరుకునే ఈ వస్తువులు చిన్న చిన్న శకలాల నుంచి భారీ ముక్కల వరకు వివిధ పరిమాణంలో ఉండే అవ‌కాశం ఉంది. 1920లో నమీబియాలోని హోబాలో గుర్తించిన‌ ఉల్కనే ఇప్పటి వరకు భూమిపై అతిపెద్దది. ఈ ఉల్క‌ కనుగొనబడిన చోటు నుంచి ఎక్కడికీ తరలించబడలేదు. అందుకు కార‌ణం దాదాపు 54,000 కిలోగ్రాముల బరువుతో భారీ పరిమాణమే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+