ఐఫోన్ బ్యాటరీ ప్రాబ్లమ్స్‌కి ఎలా చెక్ పెట్టాలో తెలుసా..!
టెక్ దిగ్గజం యాపిల్ రూపొందించే ఐఫోన్ లకు మార్కెట్ లో నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది వినియోగదారుల నమ్మకాన్ని పొందింది ఐ ఫోన్. కెమెరా, శక్తివంతమైన చిప్‌సెట్, సురక్షితమైన iOS సిస్టమ్‌తో ఐఫోన్ మార్కెట్ ని పెంచుకుంటుంది. డిజైన్ పరంగా చూస్తే, ఇది ఎంతో స్టైలిష్‌గా, ప్రీమియంగా ఉండే ఈ ఫోన్లు.. బ్యాటరీ విషయంలో మాత్రం ట్రోల్స్ ఎదుర్కొంటుంది. అయితే టెక్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇది బ్యాటరీలో సమస్య కాదని స్పష్టం చేస్తున్నారు. కేవలం కొన్ని సెట్టింగ్స్ మార్పులు చేయకపోవడం వల్ల ఇలా జరగుతుందని.. ఆ టిప్స్ ఫాలో అయితే బ్యాటరీ మరింత సమయం పనిచేస్తుందని చెబుతున్నారు.
ఆ టిప్స్ ఏంటో మీకోసం ప్రత్యేకంగా..
బ్యాటరీ చెకింగ్..
ఐఫోన్‌లో బ్యాటరీ సామర్థ్యాన్ని తెలుసుకోవడం మొదటి విషయం Settings → Battery → Battery Health & Charging లోకి వెళ్ళి, "Maximum Capacity" ను చూడండి. 80% కంటే ఎక్కువ ఉంటే బ్యాటరీ మంచి స్థితిలో ఉంది. 80% కన్నా తక్కువ ఉంటే పాతబడినట్లే భావించాలి. ఈ దశలో కూడా కొన్ని సెట్టింగ్స్ మార్పులు చేస్తే పనితీరు మెరుగుపడుతుంది.

లాక్ స్క్రీన్ విడ్జెట్..
లాక్ స్క్రీన్‌లో వాతావరణం, క్రీడా స్కోర్లు, న్యూస్ విడ్జెట్‌లు నిరంతరం రిఫ్రెష్ అవుతూ ఉంటాయి. దీని వలన బ్యాటరీ ఎక్కువ తగ్గిపోతుంది. అప్పుడు లాక్ స్క్రీన్‌పై లాంగ్ ప్రెస్ → "Customize" → విడ్జెట్‌లను "-" బటన్ ద్వారా తొలగించండి.
యానిమేషన్లు, విజువల్ ఎఫెక్ట్స్..
కొత్త iOSలో యానిమేషన్లు సూపర్ ఆకర్షణీయంగా ఉంటాయి, కానీ ప్రాసెసర్ ఎక్కువగా పనిచేస్తుంది. Settings → Accessibility → Motion → Reduce Motion ఆన్ చేయడం ద్వారా ఇంటర్‌ఫేస్ సింపుల్ అవుతుంది, బ్యాటరీ సేవ్ అవుతుంది.
కీబోర్డు హాప్టిక్స్..
టైపింగ్ సమయంలో వచ్చే చిన్న వైబ్రేషన్లు (Haptic Feedback) కూడా బ్యాటరీ ఎక్కువ అయిపోతుంది. Settings → Sounds & Haptics → Keyboard Feedback → Haptic ఆఫ్ చేయండి.
బ్యాక్‌గ్రౌండ్ యాప్ రిఫ్రెష్..
అనవసర యాప్‌లు బ్యాక్‌గ్రౌండ్‌లో డేటాను అప్‌డేట్ చేస్తాయి. Settings → General → Background App Refresh → అవసరమైన యాప్‌లకే ఆన్, మిగతా వాటిని ఆఫ్ చేయండి.
లో పవర్ మోడ్..
బ్యాటరీ 20% కంటే తక్కువగా ఉన్నప్పుడు Low Power Mode ఆన్ చేయడం ఉత్తమం. Control Centerలో ఈ ఆప్షన్‌ను సులభంగా యాక్సెస్ చేయవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ యాక్టివిటీ, ఆటో-డౌన్‌లోడ్స్, మెయిల్ ఫెచ్ తగ్గుతుంది.
లొకేషన్ సర్వీసెస్..
ప్రతి యాప్‌కి లొకేషన్ అనుమతి అవసరం లేదు. Settings → Privacy & Security → Location Services → అవసరమైన యాప్‌లకే "While Using" అనుమతిని ఇవ్వండి.
ఆటోమేటిక్ అప్‌డేట్స్..
App Storeలో ఆటోమేటిక్ అప్‌డేట్స్ నిరంతరం సర్వర్‌తో కనెక్ట్ అవుతుంది. Settings → App Store → App Updates ఆఫ్ చేయడం ద్వారా బ్యాటరీ మరియు డేటా సేవ్ అవుతుంది.
ఎయిర్‌ప్లేన్ మోడ్..
సిగ్నల్ తక్కువ ప్రాంతాల్లో ఫోన్ నిరంతరం నెట్‌వర్క్ వెతుకుతుంటుంది, ఇది బ్యాటరీ డ్రెయిన్ పెడుతుంది. అలాంటి సమయంలో Airplane Mode ఆన్ చేయండి. దీని వల్ల ఛార్జింగ్ వేగం కూడా పెరుగుతుంది.
స్క్రీన్ బ్రైట్‌నెస్ & డార్క్ మోడ్..
OLED స్క్రీన్ ఉన్న ఐఫోన్‌లలో, డార్క్ మోడ్ వాడడం బ్యాటరీ ఎక్కువ సేవ్ చేస్తుంది. ఆటో బ్రైట్‌నెస్ ఆన్ చేయండి: Settings → Accessibility → Display & Text Size → Auto-Brightness. డార్క్ మోడ్ వాడటం ద్వారా స్క్రీన్ పవర్ వినియోగం తగ్గుతుంది.
పుష్ నోటిఫికేషన్..
అన్ని యాప్‌లు నోటిఫికేషన్లు పంపాల్సిన అవసరం లేదు. Settings → Notifications → అవసరం లేని యాప్‌ల నోటిఫికేషన్లను ఆఫ్ చేయండి. ఇది స్క్రీన్ యాక్టివేషన్ తగ్గించి బ్యాటరీ సేవ్ చేస్తుంది.
ఇక ఈ సెట్టింగ్స్ మార్చడం ద్వారా ఐఫోన్ బ్యాటరీ 20-30% వరకు ఎక్కువ సమయం పని చేస్తుంది. లాక్ స్క్రీన్ విడ్జెట్‌లు, లో పవర్ మోడ్, డార్క్ మోడ్ మరియు హాప్టిక్స్ ఆఫ్ వంటి మార్పులు రోజువారీ వినియోగంలో చాలా ప్రభావం చూపుతాయి. ఇలా పాటిస్తే, మీ ఐఫోన్ రోజంతా సులభంగా పని చేస్తూ, ఛార్జర్ కోసం వెతికే పని ఉండదని చెబుతున్నారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications