ముందుంది ముసళ్ల పండగ.. 2029 నాటికి మానవాళికి అంతే..?
మారుతున్న వాతావరణ పరిస్థితులు, గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ ఛేంజ్ కారణంగా భూమి ఉపరితల ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతాయని వరల్డ్ మెటిరియోలాజికల్ ఆర్గనైజేషన్(WMO) అంచనా వేసింది. 2024తో పోల్చితే 2025-2029 మధ్య అధిక ఉష్ణోగ్రతలు పెరగడానికి 80 శాతం అవకాశం ఉందని WMO తాజగా రిలీజ్ చేసిన రిపోర్టు స్పష్టం చేసింది.గ్లోబల్ వార్మింగ్ తీవ్రస్థాయిలో పెరిగిపోతోందని తెలిపింది.
వరల్డ్ మెటిరియోలాజికల్ ఆర్గనైజేషన్(WMO).. తాజాగా గ్లోబల్ యానువల్ టూ డికేడల్ క్లైమేట్ అప్డేట్(2025-2029) అనే పేరుతో ఓ రిపోర్టును బయటపెట్టింది. రానున్న ఐదేళ్లలో వాతావరణ మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ మేర పెరుగుతాయని అంచనా వేసింది. వడగాలులు, కరవు, విపరీతమైన వాతావరణ మార్పులు సంభవిస్తాయని స్పష్టం చేసింది.
2024-2028 రిపోర్టుతో పోల్చితే 2025-2029 రిపోర్టు ప్రకారం 47 శాతం అధికంగా భూమికి విపత్తు వాటిల్లే ప్రమాదం ఉందని WMO తాజా నివేదిక వెల్లడించింది. రాబోయో ఐదేళ్లు హాటెస్ట్ ఇయర్స్ గా నమోదవుతాయని తెలిపింది. మరోవైపు అధిక ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పుల కారణంగా మంచు పర్వతాలు కరిగిపోయి.. జల ప్రళయం సంభవించే ప్రమాదం ఉందని నివేదిక తెలిపింది.
ఇప్పటికే 2024 ను హాటెస్ట్ ఇయర్ ఆఫ్ ది రికార్డుగా పేర్కొన్నారు. ట్రాఫికల్ ప్రాంతాల్లో ఈ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. నార్త్ అమెరికా, నార్త్ ఆఫ్రికా, యూరోప్, ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగాయి. 2020 నుంచి 2024 మధ్య లానినో వాతావరణ మార్పుల కారణంగా ఆర్కిటిక్ ఖండంలో మంచు కరిగి నీటిమట్టం భారీగా పెరిగిపోయింది.
2024-2029 మధ్య అధిక ఉష్ణోగ్రతలు కారణంగా 2024 రికార్డును అధిగమించడానికి 80 శాతం అవకాశం ఉందని WMO తాజా నివేదిక వెల్లడించింది. గతేడాదితో పోల్చితే ఒక్క శాతం పెరిగినా మానవాళికి పెను ముప్పుగా భావించవచ్చని పేర్కొంది.

పారిస్ వాతావరణ ఒప్పందం, 2015 ప్రకారం ప్రపంచ ఉపరితల ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీలకు మించకూడదని తీర్మానించాయి. కానీ రానున్న సంవత్సరాల్లో ఈ పరిధిని దాటే ప్రమాదం ఉంది. తీవ్రమైన ఉష్ణోగ్రతలు, కార్చిచ్చులు, తుపానులు, తీవ్రమైన వరదలు.. కారణంగా రానున్న ఐదేళ్లు మానవాళికి తీవ్ర విపత్తు పొంచి ఉందని WMO తాజా నివేదిక స్పష్టం చేసింది.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications