విరాట్ కోహ్లీకి అదే ఫైనల్ ఛాప్టర్- తేల్చి చెప్పిన మాజీ కొలీగ్ ..!!

ఆస్ట్రేలియాతో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ లో జరిగిన చివరిదైన మూడో వన్డే టీమిండియా మాజీ కేప్టెన్ రోహిత్ శర్మ, టాప్ ఆర్డర్ బ్యాటర్ విరాట్ కోహ్లీల అభిమానులకు ఊపునిచ్చింది. డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో కదం తొక్కాడీ మ్యాచ్ లో. 125 బంతుల్లో మూడు భారీ సిక్సర్లు, 13 బుల్లెట్ల వంటి ఫోర్లతో 121 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. తొలి రెండు వన్డేల్లో డకౌట్ అయిన విరాట్ కోహ్లీ ఈ గేమ్ లో తనదైన స్టైల్ లో రెచ్చిపోయాడు. 81 బంతుల్లో ఏడు ఫోర్లతో 74 పరుగులు చేశాడు.

ఆస్ట్రేలియాపై 2,500 అంతకుమించి పరుగులు కొట్టిన రెండో బ్యాటర్ అతనొక్కడే. ప్రస్తుతం ఈ రికార్డు శ్రీలంక లెజెండ్ కుమార సంగక్కార పేరు మీద ఉంది. ఈ ఇన్నింగ్ తో వారిద్దరూ కమ్ బ్యాక్ అయినట్టే. 2027 ఐసీసీ వరల్డ్ కప్ కోసం జట్టులో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నట్టే. ఈ మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో ఓ హాఫ్ సెంచరీ, సెంచరీ చేశాడు రోహిత్ శర్మ. తొలి మ్యాచ్ లో ఎనిమిది పరుగులతో సరిపెట్టుకున్నప్పటికీ.. ఆ తర్వాతి రెండు గేమ్ లల్లో విజృంభించాడు. 73, 121 పరుగులు కొట్టాడు.

2027 World Cup will be Virat Kohli s final go at the cherry on the cake on a finish to his career

ఫలితంగా తమ వన్డే ఇంటర్నేషనల్స్ కేరీర్ ను మరో రెండు సంవత్సరాల వరకు పొడిగించుకున్నట్టయింది. ఇదే విషయాన్ని దక్షిణాఫ్రికా లెజెండరీ ప్లేయర్, కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కొలీగ్.. ఏబీ డివిలియర్స్ సైతం వెల్లడించాడు. ఐసీసీ వరల్డ్ కప్ 2027ను ఆడుకుండా వీరిద్దరినీ అడ్డుకునే వాళ్లెవరూ ఉండబోరని తేల్చి చెప్పాడు. వీరిద్దరి దూకుడు.. కేరీర్ తొలి రోజులను గుర్తుకు తెచ్చిందని, అప్పట్లో ఎలా ఆడేవాళ్లో.. ఇప్పుడూ అదే విధంగా ఆడుతున్నారని అన్నాడు.

విరాట్ కోహ్లీ 2027 ప్రపంచకప్ వరకు అద్భుతమైన క్రికెట్ ఆడతాడని, యువ ఆటగాళ్లకు కోహ్లీ మార్గదర్శకుడిగా, స్ఫూర్తిప్రదాతగా కీలక పాత్ర పోషిస్తాడని డివిలియర్స్ చెప్పాడు. తన దూకుడుతో కోహ్లీ క్రికెట్ ను శాశ్వతంగా మార్చివేశాడని, ఇందుకు అతన్ని అభినందించాలని, కెరీర్ చివరి దశలో కూడా అదే స్థాయిలో ఆడుతున్నాడని, ఇంకో అయిదేళ్లు ఆడాలనుకుంటే.. తప్పనిసరిగా అంగీకరించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించాడు.

తనకు తెలిసినంత వరకు 2027 వరల్డ్ కప్ తో కోహ్లీ చాఫ్టర్ ముగియడానికే ఎక్కువగా అవకాశం ఉందని, ఆ టోర్నమెంట్ లో చివరి మ్యాచ్ ఆడిన తర్వాత క్రికెట్ కు వీడ్కోలు పలుకుతాడని డివిలియర్స్ చెప్పాడు. ఐపీఎల్ కు మాత్రం ఇప్పట్లో గుడ్ బై చెప్పకపోవచ్చని, మరో మూడు నుంచి అయిదేళ్లపాటు ఆడొచ్చని అన్నాడు. శారీరకంగా ఐపీఎల్ పెద్దగా శ్రమతో కూడుకున్నది కాదని విరాట్ కోహ్లీ అభిప్రాయపడుతున్నట్లు పేర్కొన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+