హాస్పిటల్ లో అడ్మిట్ అయిన అభిషేక్ శర్మ.. : టీ20 వరల్డ్ కప్ నుంచి అవుట్?
టీ20 వరల్డ్ కప్ రసవత్తరంగా సాగుతున్న వేళ.. భారత జట్టుకు షాకింగ్ న్యూస్ అందింది. జట్టు స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆసుపత్రి పాలయ్యాడు. కడుపు సంబంధిత ఇన్ఫెక్షన్‌తో అతను బాధపడుతున్నాడు. ఈ కారణంతో అతను నమీబియాతో జరగనున్న టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌కు దూరం కానున్నాడు. ఈ వరల్డ్ కప్ కు అందుబాటులో ఉంటాడా లేదా అనేది అతని ఆరోగ్య పరిస్థితి, ట్రీట్మెంట్, రికవరీపై ఆధారపడి ఉంది.
నమీబియాతో గురువారం జరగాల్సిన గ్రూప్ దశ మ్యాచ్‌కు ముందు- అమెరికాతో జరగిన మ్యాచ్ సమయంలోనే అభిషేక్ శర్మ అనారోగ్యానికి గురయ్యాడు. ఆ మ్యాచ్ ఆడిన తర్వాత అతని పరిస్థితి మరింత విషమించింది. తీవ్ర జ్వరంతో బాదపడ్డాడు. అదే సమయంలో కడుపునొప్పి, ఇన్ఫెక్షన్ బారిన పడ్డాడు. అతనికిడ్రిప్స్ అవసరం అయ్యాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన జట్టు ప్రాక్టీస్‌కు అతను హాజరు కాలేదు.

అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. భారత్ బౌలింగ్ సమయంలో అతను మైదానంలోకి రాలేదు. అతని స్థానంలో సంజు శాంసన్ ఫీల్డింగ్ చేశాడు. జట్టు విజయం సాధించినా పోస్ట్ మ్యాచ్ హ్యాండ్‌షేక్స్ సమయంలో కూడా అభిషేక్ శర్మ కనిపించకపోవడం అతని అనారోగ్య తీవ్రతకు అద్దం పట్టింది.
అభిషేక్ ఆరోగ్య పరిస్థితిపై అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్‌ఛేట్ మీడియాతో మాట్లాడాడు. కడుపు సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. రెండు రోజుల్లో కోలుకుంటాడని, నమీబియాతో మ్యాచ్ కు అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నట్లు తెలిపారు. వాస్తవ పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగా ఉంది. కడుపు సంబంధిత ఇన్ఫెక్షన్ తో అతను ఏకంగా ఆసుపత్రిలో అడ్మిట్ కావాల్సి వచ్చింది.
కడుపు ఇన్ఫెక్షన్‌తో ఢిల్లీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడని, కొన్ని పరీక్షలు జరుగుతున్నాయని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి కూడా. డిశ్చార్జ్ ఎప్పుడో స్పష్టం కాలేదని, నమీబియాతో మ్యాచ్ అనుమానమేనని తేల్చి చెప్పాయి. నమీబియాతో మ్యాచ్ లో అభిషేక్ శర్మ ఆడే అవకాశం లేనట్టే. అతని స్థానంలో ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ను తుదిజట్టులోకి తీసుకోవచ్చు. అతను జట్టుతో చేరితో కూర్పులో మార్పులు చోటు చేసుకుంటాయి.












Click it and Unblock the Notifications