బాబర్ ఆజమ్‌కు బిగ్ షాక్..

Babar Azam: పాకిస్తాన్ కేప్టెన్ బాబర్ ఆజమ్.. ఈ మధ్యకాలంలో స్లంప్‌ను ఎదుర్కొంటోన్నాడు. ఫామ్ కోల్పోయాడు. భారీ షాట్లు ఆడటం మరిచిపోయినట్టున్నాడు. చిన్నా, చితకా జట్ల మీద కూడా చేతులెత్తేస్తోన్నాడు. సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌.. అతని వైఫల్యానికి బెస్ట్ ఎగ్జాంపుల్.

బంగ్లాదేశ్‌తో రావల్పిండి స్టేడియంలో జరిగిన తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్‌లో డకౌట్ అయ్యాడు బాబర్ ఆజమ్. రెండో ఇన్నింగ్‌లో అతను చేసింది 22 పరుగులే. ఆ టెస్ట్‌ను ఘోరంగా ఓడిపోయింది పాకిస్తాన్. పాకిస్తాన్ నిర్దేశించిన 30 పరుగుల లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా కొట్టిపడేసింది బంగ్లాదేశ్.

Babar Azam likely to replaced in white ball captaincy with Mohammad Rizwan

అదే స్టేడియంలో జరిగిన రెండో టెస్ట్‌లోనూ అదే పరిస్థితిని ఎదుర్కొంది పాకిస్తాన్. అధ్వాన్నపు ఓటమి ఎదురైనా తన వైఖరిని గానీ, ఆటతీరును గానీ మార్చుకోలేకపోయింది. ఆ మ్యాచ్‌లో కూడా తన స్థాయి తగ్గ ఆటతీరును ప్రదర్శించలేకపోయాడు బాబర్ ఆజమ్. తొలి ఇన్నింగ్‌లో 31, రెండో ఇన్నింగ్‌లో 11 పరుగులే చేశాడు.

ఈ టెస్ట్‌ను కూడా గెలుచుకుంది బంగ్లాదేశ్. రెండు టెస్ట్ మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకుంది. పాకిస్తాన్ సొంతగడ్డపై తనకంటే ఎంతో బలమైన జట్టును మట్టికరిపించింది. ఈ సిరీస్‌లో పాకిస్తాన్ జట్టుకు షాన్ మసూద్ కేప్టెన్‌గా వ్యవహరించాడు.

బాబర్ ఆజమ్ చవి చూస్తోన్న ఈ వరుస వైఫల్యాలు.. అతని కేప్టెన్సీకి ఎసరు పెట్టినట్టు కనిపిస్తోంది. కేప్టెన్సీ నుంచి బాబర్ ఆజమ్‌ను తొలగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సారథ్య బాధ్యతల నుంచి అతన్ని తప్పించితే స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలుగుతాడని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భావిస్తోంది.

Babar Azam likely to replaced in white ball captaincy with Mohammad Rizwan

త్వరలోనే అతన్ని కేప్టెన్సీ నుంచి తొలగించవచ్చని చెబుతున్నారు. ఇప్పటికే టెస్ట్ కేప్టెన్సీని పోగొట్టుకున్నాడు బాబర్. మిగిలిన వన్డేలు, టీ20 ఇంటర్నేషనల్స్ పగ్గాలను కూడా కోల్పోవడం దాదాపుగా ఖాయమైనట్టే.

కాగా- బాబర్ ఆజమ్ స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌కు పగ్గాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ డైరెక్టర్‌తో పాటు వన్డేలు, టీ20 ఇంటర్నేషనల్స్ ఫార్మట్ హెడ్ కోచ్ గ్యారీ కిర్‌‌స్టెన్ ఇప్పటికే రిజ్వాన్‌తో మాట్లాడినట్లు తెలుస్తోంది. కేప్టెన్సీ పగ్గాలను అందుకోవడానికి అతను సుముఖంగా ఉన్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+